Bank Working Days: ఇకపై బ్యాంకులు వారానికి ఐదు రోజులే పని చేస్తాయా? కేంద్రం నిర్ణయం ఏంటి?

|

Mar 22, 2025 | 4:15 PM

భారతదేశంలో బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న వారానికి ఐదు రోజుల పని డిమాండ్ త్వరలోనే నెరవేరే అవకాశం ఉందని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ నిజంగా ఈ నిర్ణయం అమల్లోకి వస్తే బ్యాంకింగ్ రంగంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవచ్చో? ఓ సారి చూద్దాం.

1 / 5
వారానికి ఐదు రోజుల పని విధానాన్ని బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం నెలలో అన్ని ఆదివారాలతో పాటు ప్రతి రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులను సెలవులు ఇస్తున్నారు.

2 / 5
ప్రస్తుతం బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నగదు లావాదేవీలతో ఇతర సేవలను పొందేందుకు ఓపెన్ చేసి ఉంటున్నాయి. అయితే ఈ విధానం వల్ల ఇతర  ఉద్యోగులకు బ్యాంకు సేవలను పొందడం కష్టంగా ఉంటుంది.

3 / 5
ముఖ్యంగా ఇతర శాఖల ఉద్యోగులతో పాటు రోజు వారీ పనులకు వెళ్లే ప్రజలు సైతం బ్యాంకు సేవలను వినియోగించుకోవాలంటే కచ్చితంగా సెలవు పెట్టాల్సి వస్తుందని, సాయంత్రం నాలుగు గంటల తర్వాత కూడా బ్యాంకులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

4 / 5
బ్యాంకింగ్ ఉద్యోగుల ప్రతిపాదనలతో పాటు సామాన్యుల డిమాండ్ మేరకు కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. బ్యాంకులకు ప్రతి శని, ఆదివారాల్లో సెలవు ఇవ్వనుంది.

5 / 5
వారానికి ఐదు రోజుల పని విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ విధానం అమల్లోకి వస్తే సాయంత్రం నాలుగు గంటల తర్వాత బ్యాంకులు పని చేయనున్నాయి.