
నేషనల్ హాలీడేస్, రాష్ట్ర, ప్రాంతీయ సెలవులను బట్టి బ్యాంక్ సెలవులు మారుతూ ఉంటాయి. ఉగాది సందర్బంగా తెలుగు రాష్ట్రాలతో పాటు గుడి పడ్వా వేళ మార్చి 19వ తేదీన పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకులకు వెళ్లేటప్పుడు మూసివేస్తారా..? లేదా తెరిచి ఉంటాయా? అనేది వినియోగదారులు తెలుసుకోవాల్సిన అవసరముంది.

మార్చి 19వ తేదీన మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మణిపూర్, జమ్మూకశ్మీర్, గోవా, రాజస్థాన్, శ్రీనగర్‌లో బ్యాంకులు బంద్ అవుతాయి. ఆర్బీఐ హాలీడేస్ లిస్ట్ ప్రకారం ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు. కస్టమర్లు వీటిని గమనించి ప్లాన్ చేసుకోవాలి.

ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఉగాది సందర్బంగా మూతపడనున్నాయి. ఇక గుడి పడ్వా పండుగను మరాఠీ, కొంకణి హిందూవులకు నూతన సంవత్సరంగా చెబుతారు. హిందూ క్యాలెండర్‌లోని మొదటి నెల చైత్రమాసం ప్రారంభంలో మహారాష్ట్ర, గోవా, డామన్‌లో జరుపుకుంటారు

ఇక సజిబు నోంగ్మా పన్బా అనేది మణిపూర్‌లో జరుపుకుంటారు. ఈ పండుగను మైతేయ్ చీరోబా, సాజిబు చీరోబా అని కూడా పిలుస్తారు. సనామహిజంను అనుసరించేవారికి నూతన సంవత్సరం పండుగ ఇది. దీంతో మణిపూర్‌లో రేపు బ్యాంకులు క్లోజ్ చేస్తారు.

ఇక మార్చిలో రంజాన్ సందర్భంగా మార్చి 20న దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక 26న శ్రీరామనవమి సందర్భంగా కూడా బంద్ కానున్నాయి. మహావీర్ జయంతి సందర్భంగా మార్చి 31న పలు రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్ చేయనున్నారు.