Bank Rules: బ్యాంకింగ్ రూల్స్.. ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే, అకౌంట్లోని సొమ్ము ఏమవుతుంది..?

Updated on: Oct 10, 2026 | 8:14 AM

బ్యాంక్ అకౌంట్ అనేది ప్రతీఒక్కరికీ తప్పనిసరి. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ఆన్‌లైన్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్న తరుణంలో బ్యాంక్ ఖాతా అవసరంగా మారింది. అయితే బ్యాంక్ ఖాతాదారుడు, నామినీ మరణిస్తే ఖాతాలోని సొమ్ము ఎవరికి దక్కుతుందనే విషయంపై చాలామందికి అవగాహన ఉండదు.

1 / 5
ప్రస్తుత పరిస్ధితుల్లో బ్యాంక్ అకౌంట్ అనేది ప్రతీఒక్కరికీ ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అకౌంట్లోకి పొందేందుకు, నగదు ఆన్‌లైన్ ద్వారా వేరేవారికి బదిలీ చేయాలన్నా బ్యాంక్ ఖాతా అనేది అవసరం. అయితే బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసేటప్పుడు నామినీ వివరాలు అందిస్తాం. ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే.. ఆ అకౌంట్లోని బ్యాలెన్స్‌ను నామినీ విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ నామినీ కూడా చనిపోతే ఏమవుతుందనే సందేహాం చాలామందిలో ఉంటుంది.

2 / 5
బ్యాంక్ ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ లేకపోతే అకౌంట్లోని సొమ్ము ఎవరికి దక్కుతుందనే విషయం చాలామందికి తెలియదు. ఇద్దరూ మరణిస్తే చట్టబద్ద వారసులకు అంతిమ హక్కు ఉంటుంది. బ్యాంక్ ఖాతాదారుడితో ఉన్న సంబంధాన్ని నిరూపించుకోవడానికి వారసులు అవసరమైన ఆధారాలను సమర్పించాలి. డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత బ్యాంక్ సిబ్బంది పరిశీలించి డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.

3 / 5
ఖాతాదారుడి డెత్ సర్టిఫికేట్‌తో పాటు సక్సెషన్ సర్టిఫికేట్, వీలునామా, లీగర్ హెయిర్, ఇండెమ్నిటీ, కేవైసీ పత్రాలు వంటివి అందించాలి. అనంతరం బ్యాంక్ సిబ్బంది తనిఖీలు చేసిన అనంతరం డబ్బులు చట్టబద్ద వారసులకు అందిస్తారు. ఈ మేరకు బ్యాంకింగ్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఖాతాదారులు తప్పనిసరిగా నామినీ వివరాలను పొందుపర్చాలి. ఒకటి కంటే ఎక్కువమంది నామినీ వివరాలను అందించడం మంచిది.

4 / 5
నామినీ వివరాలు ఉండటం వల్ల వారికి డబ్బు అందించే ప్రక్రియ సులభతరం అవుతుంది. డబ్బులు ఎవరికి అందించాలనేది ఖాతాదారుడు ముందే పొందుపర్చడం వల్ల ప్రక్రియ సులువు అవుతుంది. ఖాతాదారుడి డెత్ సర్టిఫికేట్, కేవైసీ వివరాలు అందించడం ద్వారా నామినీ డబ్బులు ఎలాంటి జాప్యం లేకుండా విత్ డ్రా చేసుకోవచ్చు. నామినీ వివరాలు లేకపోతేనే ఇబ్బంది తలెత్తుతుంది.

5 / 5
అయితే నామినీకి ఖాతాదారుడి డబ్బులపై పూర్తి యాజమాన్యం హక్కు ఉండదు. కేవలం డబ్బు స్వీకరణ ప్రక్రియను సులభతరం చేస్తుంది. పూర్తి హక్కు చట్టబద్ద వారసులకు ఉంటుంది. దీంతో సంపాదించిన డబ్బు సరైన వ్యక్తులకు చేరాలంటే వీలునామా రావడం వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే కుటుంబాల్లో వివాదాలు తలెత్తే అవకాశముంది.

Loading...
Unable to load recommendations.
Follow Us