Bajaj Pulsar N125: బజాజ్‌ బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మార్కెట్లోకి స్టైలిష్‌గా బజాజ్ పల్సర్

|

Oct 20, 2024 | 10:03 PM

పర్సల్‌ బైక్‌ అంటేనే ఎంతో క్రేజ్‌. పల్సర్‌ మోడళ్లలో ఏ బైక్‌ వచ్చినా అమ్మకాలు భారీగానే జరుగుతుంటాయి. తాజాగా బజాజ్‌ నుంచి మరో కొత్త మోడల్‌ పల్సర్‌ మార్కెట్లోకి రానుంది. ఈ బజాజ్ పల్సర్ ఎన్125 బైక్‌ స్ప్లిట్ సీట్, సైడ్ ప్యానెల్, టెయిల్ సెక్షన్ మీద కొన్ని కొత్త గ్రాఫిక్స్‌తో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది..

1 / 5
ద్విచక్ర వాహనాల రంగంలో బజాజ్‌ పల్సర్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. పర్సర్‌ అంటేనే ఎంతో మంది ఇష్టపడేవారున్నారు. అయితే బజాజ్‌ ఆటో పల్సర్‌లో రకరకాల మోడళ్లను విడుదల చేస్తుంది.

2 / 5
ఈ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో తన బజాజ్ పల్సర్ ఎన్125 మోటారు సైకిల్ త్వరలో భారత్ మార్కెట్లో విడుదల చేయనుంది. కొత్త మోడల్‌ బజాజ్‌ పల్సన్ ఎన్125 బైక్‌ అగ్రెసివ్ స్టైలింగ్‌తో భారత మార్కెట్లోకి రానుంది. ఎల్ఈడీ హెడ్ లైట్ తోపాటు ముందు ప్లాస్టింగ్ క్లాడింగ్ ఉంటుంది.

3 / 5
బజాజ్ ఎన్150 నుంచి వీల్స్, బజాజ్ ఫ్రీడం 125 నుంచి డిస్ ప్లే ఇండికేటర్ ఉంటాయి. అంటే బజాజ్ ఎన్125 బైక్‌ ప్రాథమికంగా ఇన్ బిల్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌తో వస్తోంది.

4 / 5
బజాజ్ పల్సర్ ఎన్125 బైక్‌ స్ప్లిట్ సీట్, సైడ్ ప్యానెల్, టెయిల్ సెక్షన్ మీద కొన్ని కొత్త గ్రాఫిక్స్‌తో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. టీవీఎస్ రైడర్, హీరో ఎక్స్ ట్రీం 125 ఆర్ వంటి మోటారు సైకిళ్ల మాదిరిగా స్ప్లిట్ సీట్ కలిగి ఉంటుందని తెలుస్తోంది.

5 / 5
అయితే దీని ధర రూ.90 వేల నుంచి రూ.1.10 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న పల్సర్‌ బైక్‌ల కంటే సరికొత్తగా ఉండనుందని తెలుస్తోంది.