Best Bikes: రూ.65 వేలకే ఏకంగా 90 కిలోమీటర్ల మైలేజ్.. ఈ బైక్ కొంటే పెట్రోల్ ఖర్చే ఉండదు..

Updated on: Dec 07, 2025 | 5:54 PM

ప్రస్తుతం మార్కెట్లో రకరకాల బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే ఎక్కువదూరం మైలేజ్ ఇచ్చే బైక్స్ చాలానే ఉన్నాయి. అందులో మిడిల్ క్లాస్ ప్రజలకు ఉపయోగపడే బెస్ట్ బైక్ ఒకటి ఉంది. అందే బజాజ్ ప్లాటినా 100.. ఈ బైక్ వివరాలు..

1 / 5
బైక్ అనేది ఈ రోజుల్లో అందరికీ అవసరమే. ఆఫీసుకు వెళ్లాలన్నా లేదా బయటకు ఎక్కడికైనా అత్యవసరంగా వెళ్లాలన్నా బైక్ కలిగి ఉంటే వెంటనే చేరుకోవచ్చు. కేంద్రం జీఎస్టీ తగ్గింపుతో ప్రస్తుతం బైక్ ధరలు మరింతగా తగ్గాయి. దీంతో కొత్త బైక్ కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. బైక్ కొనుగోలు చేయాలంటే చాలా కన్‌ప్యూజన్ ఉంటుంది. ఏ బైక్ కొనుగోలు చేస్తే మంచిదనేది ఫ్రెండ్స్‌ను అడిగి తెలుసుకుంటూ ఉంటారు.

2 / 5
ప్రస్తుత ఆటోమొబైల్ మార్కెట్లో తక్కువ ధరకే ఎక్కువ మైలేజ్ వచ్చే బైక్‌లకు విపరీతంగా డిమాండ్ ఉంది. పెట్రోల్ రేట్లు పెరిగిన నేపథ్యంలో మైలేజ్ ఎక్కువిచ్చే బైక్‌ల కోసం వెతుకుతున్నారు. అందులో బజాజ్ ప్లాటినా ఒకటి. బేసిక్ వేరియెంట్ రూ.65 వేలకు లభిస్తున్న  ఈ బైక్.. దాదాపు 75 నుంచి 90 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీంతో ఈ బైక్‌ను మైలేజ్ కింగ్‌గా చెబుతున్నారు.

3 / 5
రెండు వేరియంట్లలో ఈ బజాజ్ ప్లాటినా 100 లభిస్తుంది. ఎంట్రీ లెవల్ బజాజ్ ప్లాటినా 100 ఎక్స్‌షోరూమ్ ధర రూ.65,407గా ఉండగా..  ఇక ప్లాటినా 110 డ్రమ్ వెర్షన్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.69,284 వద్ద కొనసాగుతోంది. రోజూ ఆఫీసులకు వెళ్లేవారికి, డెలివరీ బాయ్స్‌కు ఈ బైక్స్ బెస్ట్ ఛాయిస్‌గా చెప్పవచ్చు. సింపుల్ మెయింటనెన్స్‌తో పాటు  రన్నింగ్ ఖర్చులు తక్కువ అవుతాయి.

4 / 5
బజాజ్ ప్లాటినా 100లో సింగిల్ సిలిండర్ DTS-i ఇంజిన్ ఉంటుంది. DTS-i టెక్నాలజీతో ఇది ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. దీని వల్ల పెట్రోల్‌ను తక్కువగా వాడుతుంది. ఇక ఇందులో 11 లీటర్ల సామర్థ్యం గల పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 700 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

5 / 5
బజాజ్ ప్లాటినా 100తో పోలిస్తే ప్లాటినా 110 మరింత శక్తివంతమైన ఇంజిన్‌ను కలిగి ఉంది. 115.45 సీసీ సింగిల్ సిలిండర్‌తో పాటు ఎయిర్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఇందులో అమర్చారు. దీని వల్ల ఈ బైక్‌లో ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది. మధ్యతరగతి ప్రజలకు ఈ బైక్‌లు మంచి ఎంపికగా చెప్పవచ్చు.