Budget Cars: కేవలం రూ.3.50 లక్షలకే కారు.. అద్భుతమైన మైలేజీతో తక్కువ ధరల్లో టాప్ మోడల్స్ ఇవే!

Updated on: Sep 03, 2026 | 9:01 PM

Budget Cars: తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలనుకునే వారికి, ధర మాత్రమే కాకుండా మైలేజ్ కూడా ఒక ముఖ్యమైన అంశం. ముఖ్యంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో మంచి మైలేజ్ ఇచ్చే హ్యాచ్‌బ్యాక్ కార్లకు డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కలెక్షన్‌లో రూ. 3.50 లక్షల నుండి ప్రారంభమయ్యే టాప్ 5 బడ్జెట్ కార్లను వివరంగా పరిశీలిద్దాం..

1 / 5
 Budget Cars: మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.50 లక్షలు. పెట్రోల్, CNG ఆప్షన్లలో లభించే ఈ కారు, పెట్రోల్ మోడల్‌లో 24.12 నుండి 25.30 కి.మీ/లీ మైలేజీని ఇస్తుంది. CNG వెర్షన్ 32.73 కి.మీ/లీ వరకు మైలేజీని ఇవ్వగలదని చెబుతున్నారు.

2 / 5
 మారుతి సుజుకి ఆల్టో K10: ఆల్టో K10 ధర రూ. 3.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పెట్రోల్, CNG ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్‌లో దీని మైలేజ్ లీటరుకు 24.39 నుండి 24.90 కి.మీ. CNGలో కిలోగ్రాముకు 33.40 నుండి 33.85 కి.మీ.గా ఉంటుంది.

3 / 5
 రెనాల్ట్ క్విడ్: రెనాల్ట్ క్విడ్ ధర రూ. 4.30 లక్షల నుండి ప్రారంభమవుతుంది. పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ లీటరుకు సుమారు 22 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. CNG మోడల్ కిలోగ్రాముకు 26.49 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుందని చెబుతున్నారు.

4 / 5
 టాటా టియాగో: టాటా ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో ఒకటైన టియాగో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.57 లక్షలు. పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్‌లలో లభించే ఈ కారులో, పెట్రోల్ మోడల్ లీటరుకు సుమారు 20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుండగా, సీఎన్‌జీ మోడల్ కిలోగ్రాముకు 27.28 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

5 / 5
 మారుతి సుజుకి సెలెరియో: ఈ జాబితాలో మైలేజ్ పరంగా ప్రత్యేకంగా నిలిచే మరో కారు మారుతి సుజుకి సెలెరియో. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.70 లక్షలు. పెట్రోల్ వెర్షన్ 24.97 నుండి 26.68 కి.మీ/లీ మైలేజీని అందిస్తుంది. సీఎన్‌జీ మోడల్ 34.43 కి.మీ/కేజీ మైలేజీని అందిస్తుందని చెబుతున్నారు. తక్కువ ధర, మంచి మైలేజ్, రోజువారీ వాడకాన్ని పరిగణనలోకి తీసుకుంటే, కారు కొనాలనుకునే వారికి ఈ మోడళ్లు బడ్జెట్‌కు అనుకూలమైన ఎంపికలుగా ఉంటాయి. వేరియంట్, ఇంధన రకం, డ్రైవింగ్ వాతావరణాన్ని బట్టి వాస్తవ మైలేజ్ మారవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us