
కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఆలస్యం చేయకుండా బుధవారం సాయంత్రం లోపు కొనుగోలు చేసేయండి. ఎందుకుంటే ఎల్లుండి నుంచి అంటే ఏప్రిల్1 నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి.

కరోనా సమయంలో ఏర్పడిన సంక్షోభం, తయారీ ఖర్చులు పెరగడం కారణం ఏదైతేనేమి.. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. మరి పెరగనున్న ఆ కార్లేంటో ఓ సారి చూడండి..

ఫోర్డ్: ఫోర్డ్ కంపెనీ ఏప్రిల్ 1 నుంచి తమ కార్ల ధరలు పెరగనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మోడల్‌ను అనుసరించి అస్పైర్, ఎండోవర్, ఎకోస్పోర్ట్, ఫిగో కార్లపై ధరలు పెరగనున్నాయి.

టొయోటా: ఎమేర పెంచుతామో చెప్పకపోయినప్పటికీ టొయోటా కూడా తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఇన్‌పుట్ ధరలు పెరగడంతో ధరలను పెంచడం అనివార్యమవుతోందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

మారుతి సుజికి: భారత దేశంలో పెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతి సుజికి కూడా ధరలను పెంచేస్తోంది. మోడళ్లను బట్టి 1 నుంచి 6 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. అంటే తక్కువలో తక్కువ రూ.30 వేలకుపైగానే పెరగనున్నాయన్నమాట.

డాట్సన్: డాట్సన్ కంపెనీ గో, గో+, రెడిగో కార్ల ధరలను ఏప్రిల్ 1 నుంచి పెంచనున్నట్లు ప్రకటించింది. పెంపు ఏ రేంజ్‌లో ఉంటుందో తెలియాల్సి ఉంది.

రెనాల్ట్: ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతోన్న రెనాల్ట్ కూడా ధరలు పెంచనుంది. ఈ బ్రాండ్‌కు చెందిన డస్టర్, క్విడ్, ట్రైబర్ వంటి కార్లపై ఏప్రిల్ 1 నుంచి ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది.