ఒక నెల రీఛార్జ్ చేస్కుంటే.. మరో నెల పాటు ఫ్రీ.. ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్.. మిస్సవ్వకండి..

Updated on: Nov 09, 2026 | 1:28 PM

ఒక నెల ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకుంటే మరో నెల ఉచితంగా పొందవచ్చు. ఈ మేరకు తమ యూజర్లకు ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. అంటే మీరు 28 రోజుల వ్యాలిడిటీ గల ప్లాన్ ఎంచుకుంటే.. మరో 28 నెలలు ఉచితంగా పొందవచ్చు.

1 / 5
తమ యూజర్లకు ఎయిర్‌టెల్ భారీ శుభవార్త అందించింది. ప్రస్తుతం రీఛార్జ్ ధరలు పెరిగిపోయిన క్రమంలో మొబైల్ వినియోగదారులపై పెను భారం పడుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు రీఛార్జ్ టారిఫ్ ధరలను టెలికాం కంపెనీలు పెంచేశాయి. 5జీ విస్తరణ, నిర్వహణ ఖర్చు పెరుగుతుండటంతో రీఛార్జ్ ధరలను పెంచినట్లు కంపెనీలు చెబుతున్నాయి. ఇదే క్రమంలో రీఛార్జ్ కోసం చేసే ఖర్చును తగ్గించేందుకు కంపెనీలు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

2 / 5
ఒక నెల రీఛార్జ్ చేసుకుంటే మరో నెల రీచార్జ్ ఉచితంగా అందించనుంది. ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే మాత్రమే ఈ ఆఫర్ పొందవచ్చు. ఇందుకోసం పలు రీఛార్జ్ ప్లాన్లపై వన్ ప్లాస్ వన్ ఆఫర్ ప్రవేశపెట్టింది. అంటే మీరు ఒక నెల రీఛార్జ్ చేసుకుంటే ఒక నెల ఉచితంగా పొందవచ్చన్నమాట. దీని వల్ల ఒక నెల పాటు మళ్లీ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండకపోవడం వల్ల డబ్బులు ఆదా అవుతాయి.

3 / 5
ఎయిర్‌టెల్ యూజర్లకు రూ.349, రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్లాన్లపై 1+1 ఆఫర్ ప్రవేశపెట్టింది. అంటే మీరు ఈ ప్లాన్లలో ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే మరో నెల ఉచితంగా పొందవచ్చు. ఎయిర్ టెల్ రూ.349 ప్లాన్ 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. 5జీ వినియోగదారులు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల తర్వాత మరో 28 రోజులు ఉచితంగా లభిస్తుంది.

4 / 5
అంటే మొత్తం 56 రోజుల పాటు మీ ప్లాన్ యాక్టివ్‌లో ఉంటే.. దీని వల్ల మీ నెలవారీ రీఛార్జ్ ఖర్చు తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో 12 నెలల పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రీప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీని విలువ సాధారణంగా రూ.4 వేలు ఉంటుంది. మీరు దీనిని ఉచితంగా పొందవచ్చు. ఇక రూ.399 రీఛార్జ్ ప్లాన్‌లో కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది.

5 / 5
రూ.399 రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఇందులో ఎలాంటి రోజువారీ పరిమితి లేకుండా అన్‌లిమిటెడ్ 4జీ, 5జీ డేటా పొందవచ్చు. మీరు ఈ ప్లాన్ ఎంచుకుంటే మరో 28 రోజుల పాటు ఉచితంగా పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది పరిమితికాల ఆఫర్ కావడంతో కేవలం కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశముంది. దీంతో ఒకసారి రీఛార్జ్ చేసుకునేముందు చెక్ చేసుకోండి..

Loading...
Unable to load recommendations.
Follow Us