Electric scooter: మార్కెట్లోకి ఏసర్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏకంగా..
ఇక MUVI 125 4G ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్కూటర్ రేంజ్ 80 కిలోమీటర్లుగా ఉండనుంది. స్కూటర్ మ్యాగ్జిమం స్పీడ్ గంటకు 75 కి.మీల వేగంతో దూసుకుపోతుంది. ఛార్జింగ్ కోసం ఇందులో స్వాప్ చేయగల బ్యాటరీని అందించారు. తేలికపాటి ఛాసిస్ ఈ స్కూటర్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. 16 ఇంచెస్‌తో కూడిన వీల్స్, కాంపాక్ట్ డిజైన్, డబుల్ డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్స్ అందించారు.