AC vs Air Cooler: ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్? ఖర్చు, పనితీరులో ఏది టాప్!

Updated on: Apr 29, 2026 | 1:43 PM

AC vs Air Cooler: ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్? ఖర్చు, పనితీరులో ఏది టాప్ అనే విషయంలో చాలా మందికి గందరగోళం ఉంటుంది. అయితే రెండు కూడా మంచివే అయినా.. దేని ప్రయోజనాలు దానికే ఉంటాయి. అయితే ధరల్లో కూడా తేడా ఉంటుంది. దానికి తగ్గట్లుగానే ప్రయోజనాలు ఉంటాయని గుర్తించుకోండి. మరి రెండింటిలో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం..

1 / 5
 AC vs Air Cooler: Which One Should You Choose This Summer? Cooling Speed, Cost, and Efficiency Compared. AC vs Air Cooler: వేసవి ఎండలు మండిపోతున్న తరుణంలో చాలామందిని వేధించే ప్రశ్న "ఏసీ (AC) కొనాలా? లేక ఎయిర్ కూలర్ (Air Cooler) తీసుకోవాలా? అని. ఈ రెండింటిలో ఏది వేగంగా చల్లబరుస్తుంది? ఖర్చు ఎక్కడ తక్కువ అవుతుంది? భారతీయ వాతావరణానికి ఏది ఉత్తమం? అనే అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకుందాం..

2 / 5
 ఏసీ, కూలర్ మధ్య ప్రధాన వ్యత్యాసాలు: ఎయిర్ కూలర్: ఇది 'బాష్పీభవనం' (Evaporative Cooling) ప్రక్రియపై పనిచేస్తుంది. అంటే వేడి గాలిని పీల్చుకుని, నీటి ద్వారా చల్లబరిచి బయటకు పంపుతుంది. దీనికి తాజా గాలి నిరంతరం అవసరం. ఏసీ: ఇది గదిలోని వేడి గాలిని పీల్చుకుని, రిఫ్రిజిరెంట్ గ్యాస్ సహాయంతో చల్లబరుస్తుంది. ఇది గదిలోని తేమను (Humidity) కూడా తగ్గిస్తుంది. దీనికి గది పూర్తిగా మూసి ఉండాలి.

3 / 5
 ఖర్చు విషయానికొస్తే కూలర్..ధర చాలా తక్కువే. రూ.5,000 - రూ.15,000 వరకు ఉంటుంది. దీని నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. కేవలం నీరు నింపడం, అప్పుడప్పుడు ప్యాడ్స్ మార్చడం సరిపోతుంది. అదే ఏసీ అయితే కొనుగోలు ధర రూ.30,000 - రూ.60,000 మధ్య ఉంటుంది. ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, ప్రతి ఏడాది సర్వీసింగ్ వంటి ఖర్చులు ఉంటాయి.

4 / 5
 విద్యుత్ వినియోగం విషయానికొస్తే.. కూలర్ చాలా తక్కువ విద్యుత్తును వాడుకుంటుంది (దాదాపు ఫ్యాన్ కంటే కొంచెం ఎక్కువ). దీనివల్ల కరెంటు బిల్లు భారంగా అనిపించదు. అదే ఏసీ అయితే ఇది ఎక్కువ విద్యుత్తును తీసుకుంటుంది. ఇన్వర్టర్ ఏసీలు కొంత వరకు కరెంటును ఆదా చేసినప్పటికీ, కూలర్‌తో పోలిస్తే బిల్లు ఎక్కువే వస్తుంది.

5 / 5
 ఇక వాతావరణంలో కూలర్: ఇది పొడి వాతావరణం (Dry Heat) ఉన్న ప్రాంతాల్లో అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఉక్కపోత ఎక్కువగా ఉన్న తీర ప్రాంతాల్లో అంత ప్రభావవంతంగా ఉండదు. అదే ఏసీ అయితే ఇది ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేస్తుంది. ముఖ్యంగా ఉక్కపోత ఎక్కువగా ఉన్నప్పుడు ఏసీ మాత్రమే సౌకర్యాన్ని ఇవ్వగలదు.

Follow Us