మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు

Updated on: Sep 23, 2026 | 6:13 PM

ప్రతి నెలా శాలరీ అకౌంట్‌లో పడగానే ఏదో విధంగా ఆదా చేద్దామనుకుంటాం. కానీ నెల మధ్యకే ఈఎంఐలు, ఇంటి అద్దె, పెట్రోల్, గ్రాసరీస్, పిల్లల ఫీజులతో బ్యాంక్ ఖాతా పూర్తిగా ఖాళీ అయిపోతుంది. మళ్లీ వచ్చే నెల జీతం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడటం సర్వసాధారణంగా మారింది. అయితే కొందరు ఉద్యోగులు మాత్రం కేవలం శాలరీ పైనే ఆధారపడకుండా, వారాంతాల్లోని ఖాళీ సమయాన్ని లేదా అదనపు పొదుపును ఉపయోగించి పక్కాగా రెండో ఆదాయ వనరును  నిర్మించుకుంటున్నారు. ఈ 8 అద్భుతమైన పాసివ్ ఇన్‌కమ్ ఐడియాల వివరాలను ఇప్పుడు చూద్దాం.

1 / 8
రెంటల్ ఇన్‌కమ్ : మీ ఇంట్లో ఖాళీగా ఉన్న గది, తరచూ వాడని బైక్, కారు లేదా కెమెరా వంటి విలువైన వస్తువులను సరైన నియమ నిబంధనలతో అద్దెకు ఇవ్వడం ద్వారా అసెట్ మీకోసం సంపాదించేలా చేయవచ్చు.

2 / 8
డివిడెండ్ స్టాక్స్: స్టాక్ మార్కెట్లో కేవలం షేర్ల విలువ పెరిగితేనే కాకుండా.. మంచి లాభాల్లో ఉన్న కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం ద్వారా అవి ఇచ్చే త్రైమాసిక లేదా వార్షిక డివిడెండ్ల రూపంలో స్థిరమైన పాసివ్ ఆదాయం పొందవచ్చు.

3 / 8
ఫ్రీలాన్సింగ్ : రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, కోడింగ్, థంబ్‌నెయిల్ డిజైన్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ వంటి ఉపయోగకరమైన నైపుణ్యాలు ఉంటే.. వారాంతాల్లో కేవలం 2-3 గంటలు కేటాయించి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టుల ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.

4 / 8
డిజిటల్ ప్రొడక్ట్స్ / ఆన్‌లైన్ కోర్సులు: "మేక్ వన్స్.. సెల్ మెనీ టైమ్స్" ఒక్కసారి తయారు చేసి వేల సార్లు అమ్మే కాన్సెప్ట్ ఇది. ఈ-బుక్స్, రెడీమేడ్ డిజైన్ టెంప్లేట్లు, నోట్స్ లేదా ఒక స్కిల్‌కు సంబంధించిన కోర్సులను రూపొందిస్తే నిరంతరం సేల్స్ వస్తుంటాయి.

5 / 8
అఫిలియేట్ మార్కెటింగ్: మీకు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, బ్లాగ్ లేదా ఆన్‌లైన్ ఫాలోయింగ్ ఉంటే.. ప్రజలకు ఉపయోగపడే నాణ్యమైన ఉత్పత్తులను మీ అఫిలియేట్ లింక్ ద్వారా రికమండ్ చేస్తూ కమిషన్ పొందవచ్చు.

6 / 8
బాండ్స్ & పీర్ టు పీర్ లెండింగ్: అదనంగా ఉన్న నగదును ప్రభుత్వ/కార్పొరేట్ బాండ్లలో లేదా రిజర్వ్ బ్యాంక్ ఆమోదం పొందిన P2P ప్లాట్‌ఫామ్‌లలో ఇన్వెస్ట్ చేసి సురక్షితమైన వడ్డీ ఆదాయం పొందవచ్చు.

7 / 8
సెల్ఫ్ సర్వీస్ / వెండింగ్ మెషీన్స్: కస్టమర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రైమ్ లొకేషన్లలో కాఫీ మెషీన్లు, వాటర్ డిస్పెన్సర్లు వంటి సెల్ఫ్ సర్వీస్ ఎక్విప్‌మెంట్‌ను ఏర్పాటు చేస్తే సిబ్బంది లేకుండానే అవి లాభాలను తెచ్చిపెడతాయి.

8 / 8
రికరింగ్ ఇన్‌కమ్ మోడల్: ఇది వ్యాపారంలో అత్యంత శక్తివంతమైన ప్రిన్సిపుల్. ప్రతి నెలా కొత్త కస్టమర్ కోసం వెతకాల్సిన అవసరం లేకుండా.. సబ్‌స్క్రిప్షన్ లేదా సర్వీస్ ద్వారా ఒకే కస్టమర్ మళ్లీ మళ్లీ కొనుగోలు చేసేలా సిస్టమ్ నిర్మించడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌కు అసలైన రాజమార్గం!

Loading...
Unable to load recommendations.
Follow Us