Gas Cylinder: ఈ సిలిండర్ ఇస్తే క్షణాల్లోనే రూ.500 రీఫండ్.. కేంద్ర ప్రభుత్వం కొత్త సదుపాయం..

Updated on: Jul 03, 2026 | 7:40 AM

ఇంట్లో 14.2 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉంటారు. ఇక 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల గురించి తెలిసిందే. అయితే ఇటీవల మార్కెట్లోకి 5 కేజీల సిలిండర్ కూడా వచ్చేసింది. దీని ఉపయోగాలేంటి.. తిరిగి అందిస్తే రూ.500 వస్తుందా..?

1 / 5
గతంలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం క్రమంలో ఎల్పీజీ గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. అంతేకాకుండా గ్యాస్ సరఫరాలో అంతరాయం వల్ల డెలివరీలు ఆలస్యమయ్యాయి. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కూడా కొద్ది రోజుల పాటు కేంద్రం ఆంక్షలు విధించింది. దీంతో గృహ, వాణిజ్య అవసరాల కోసం 5 కేజీల “చోటు” ఎల్పీజీ సిలిండర్లను కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సిలిండర్లు బాగా ఫేమస్ అయ్యాయి.

2 / 5
ఉద్యోగులు, వలస కార్మికులు, స్టూడెంట్స్‌కు 5 కేజీల చోటు ఎల్పీజీ సిలిండర్లు బాగా ఉపయోగపడుతున్నాయి.  తక్కువ ఎల్పీజీ వినియోగం ఉన్న ఇళ్లతో పాటు పరిమిత స్థలం ఉన్న చిన్న వాణిజ్య సంస్థలకు కూడా ఈ చోటా సిలిండర్ ఉపయోగించవచ్చు. ఇది తీసుకునేందుకు ఎలాంటి లోకల్ అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. పెట్రోల్ బంకులు, కిరాణా దుకాణాలు, స్థానిక సూపర్ మార్కెట్లలో దీనిని కొనుగోలు చేయవచ్చు. కేవలం ఏదైనా గుర్తింపు ధృవీకరణ పత్రం అందిస్తే సరిపోతుంది.

3 / 5
వినియోగదారులు ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాన్ని సమర్పిస్తే సిలిండర్ అందిస్తారు. ఇక గ్యాస్ ఏజెన్సీ, పెట్రోల్ పంపులు, దుకాణాల వల్ల సులువుగా రీఫిల్ చేసుకోవచ్చు. ముందుగా సిలిండర్ కోసం ఎలాంటి బుకింగ్ అవసరం ఉండదు. వేరే సిటీ, పట్టణానికి మారినా స్థానిక దుకాణాల్లో సులభంగా రీఫిల్ చేసుకోవచ్చు. ఈ సౌలభ్యం వల్ల ఎక్కువమంది దీనిని వాడుతున్నారు.

4 / 5
ఇక అధీకృత విక్రయ కేంద్రం నుండి చోటు సిలిండర్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులు.. దానిని ఎప్పుడైనా వాపసు చేయవచ్చు. సిలిండర్‌ను ఎంతకాలం ఉపయోగించినప్పటికీ.. వాపసు చేస్తే ప్రతి సిలిండర్‌కు రూ. 500 రీఫండ్ లభిస్తుంది. ఈ సిలిండర్లకు ఉన్న మరొక బెనిఫిట్ ఇదేనని చెప్పవచ్చు. దీంతో ఈ సిలిండర్లు ప్రజాదరణను సంపాదించుకున్నాయి

5 / 5
ప్రముఖ గ్యాస్ కంపెనీలు అయినా ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ ఈ సిలిండర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఇప్పటికే విరివిగా మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చాయి. ఇటీవల చాలామంది వీటిని ఉపయోగిస్తున్నారు. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి లోకల్ ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఈ 5 కేజీల సిలిండర్‌కు అలాంటిది అవసరం లేదు.

Follow Us