
కావాల్సిన పదార్థాలు : క్యారెట్ మిల్క్ షేక్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్ పుష్కలంగా ఉండటమే కాకుండా, కొడంత బలాన్నిడా ఇస్తుంది. అలాగే దీనిని చాలా సులభంగా కేవలం 15 నిమిషాల్లోనే తయారు చేయవచ్చును. అయితే ఈ క్యారెట్ మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల విషయంలోకి వస్తే, ఒక క్యారెట్ సన్నగా తరిమి పక్కన పెట్టుకోవాలి, నానబెట్టి, తొక్క తీసిన బాదం పలుగులు, కప్పున్నర చల్లార్చిన పాలు, ఖర్జూరం, పచ్చియాలకుల పొడి, జీడిపప్పులు

తయారీ విధానంలోకి వెళితే..తురిమిన క్యారెట్ తీసుకోవాలి. నానబెట్టిన బాదం పలుగులు, జీడప్పు, వీటన్నింటిని ఒక కప్పులోకి తీసుకోవాలి. తర్వాత వీటిని మిక్సీలో వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిలోనే తురిమిన క్యారెట్ కూడా వేసుకోవాలి. మంచిగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు కప్పు పాలు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టాలి. అందులో పాలు పోసి, పాలు చాలా చిక్కగా, వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇది చక్కటి పేస్ట్ వచ్చే వరకు లో ఫ్లేమ్ మంటపై పాలు పోసి మరగబెట్టుకోవాలి. అప్పుడు ఈ మిల్క్ షేక్ చాలా అద్భుతమైన రుచిని ఇస్తుంది. తర్వాత ఇందులో యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.

ఈ మిల్క్ పేస్ట్‌లో దంచిన యాలకుల పొడి, మీకు నచ్చిన తీపి పదార్థం, క్రీమిగా, నురుగ అయ్యే వరకు మళ్లీ వీటన్నింటిని కలుపుకోవాలి. తర్వాత చల్లని పాలు తీసుకోవాలి. ఇవి పోయడం వలన మిల్క్ షేక్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంతే కాకుండా క్రీమీగా ఉటుంది. ఇప్పుడు వీటన్నింటిని మిక్సీజార్‌లోకి తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రుచిని ఇస్తుంది.

ఇప్పుడు ఈ మిల్క్ షేక్‌ను సర్వింగ్ గ్లాస్‌లోకి తీసుకోవాలి. తర్వాత అందులో రెండు లేదా మూడు కుంకుమ పువ్వు రేకులు, బాదం ముక్కలు వేసి మంచిగా అలంకరించుకోవాలి. అంతే కాకుండా వీటిని చాలా మంచిగా అలంకరణ చేసిన తర్వాత తాగేయ్యాలి. అంతే టేస్ట టేస్టీ రుచికరమైన క్యారెట్ మిల్క్ షేక్ రెడీ.