చిటికెలో రక్తాన్ని పెంచే బీట్ రూట్ పెరుగు పచ్చడి.. తింటే, లేవలేనోళ్లు కూడా లేచి పరిగెడతారు

Updated on: Apr 17, 2026 | 10:15 AM

Beetroot perugu pachadi recipe in telugu: రక్తం లేని వాళ్లకి ఈ బీట్ రూట్ పచ్చడి వరం లాంటిదనే చెప్పుకోవాలి. వీళ్ళు వారంలో మూడు సార్లు తింటే రక్తం బాగా పడుతుంది. ఇంకా వేడి వేడి అన్నంలో లేదా రోటీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలంటే?

1 / 5
కావాల్సిన పదార్దాలు:  రెండు బీట్‌రూట్ లు, ఒక కప్పు పెరుగు, నాలుగు పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ నూనె , అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టేబుల్ స్పూన్ జీలకర్ర,  నాలుగు కరివేపాకులు, 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి.

2 / 5
ముందుగా బీట్‌రూట్ తీసుకుని పైన తొక్క తీసి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా తురుముకున్నా కూడా మంచిగా ఉంటుంది.ఆ తర్వాత నీళ్లతో వీటిని మెత్తగా బాగా ఉడికించాలి

3 / 5
ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కూడా కొద్దిగా  మిక్సీలో లేదా మెత్తగా పట్టుకోవాలి. ఇలా చేస్తే పచ్చడికి మంచి రుచిని ఇస్తుంది. ఆ తర్వాత పెరుగును తీసుకుని కవ్వంతో కొద్దిగా తిప్పుకోవాలి.

4 / 5
ఆ తర్వాత ఉడికించిన బీట్‌రూట్ తీసుకుని దానిలో పెరుగు పేస్ట్ ను వేసి కలపాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న  మసాలాను వేసి 
బాగా కలుపుకోవాలి. ఆ తరవాత దీనిని పోపు పెట్టుకోవాలి. పాన్‌లో మళ్లీ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర కూడా బాగా వేయించాలి.

ఆ తర్వాత ఉడికించిన బీట్‌రూట్ తీసుకుని దానిలో పెరుగు పేస్ట్ ను వేసి కలపాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలాను వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరవాత దీనిని పోపు పెట్టుకోవాలి. పాన్‌లో మళ్లీ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర కూడా బాగా వేయించాలి.

5 / 5
ఈ పోపును తీసుకుని పెరుగు-బీట్‌రూట్ పై పోసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ పచ్చడి చల్లగా లేదా ఇంకా వేడి వేడి అన్నంలో లేదా రోటీతో తింటే టేస్టీగా ఉంటుంది

Follow Us