ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్.. ఏది తింటే శరీరంలో కొవ్వు కరుగుతుంది..?

Updated on: Jul 04, 2026 | 7:20 AM

ఈ రోజుల్లో బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. పోషకాలు పుష్కలంగా లభించడంతో పాటు, దీనిని రకరకాలుగా వండుకుని తినే వెసులుబాటు ఉండటమే ఇందుకు కారణం. అయితే బరువు తగ్గాలనుకునే వారు లేదా శరీరానికి ప్రోటీన్ అందాలనుకునే వారికి ఒక పెద్ద డౌట్ ఉంటుంది. ఉడకబెట్టిన గుడ్డు మంచిదా లేక ఆమ్లెట్ మంచిదా అని. వీటి తయారీ విధానం వాటి పోషక విలువలను ఎలా మారుస్తాయో తెలుసుకుందాం..

1 / 5
ఉడుకబెట్టిన గుడ్డు:  ఉడకబెట్టిన గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఎందుకంటే దీనిని వండటానికి నూనె, పాలు లేదా ఎలాంటి అదనపు మసాలాలు అవసరం లేదు. ఒక పెద్ద బాయిల్డ్ ఎగ్ తింటే శరీరానికి దాదాపు 6 నుండి 6.3 గ్రాముల పూర్తి స్థాయి ప్రోటీన్ అందుతుంది. ఇందులో శరీరానికి అవసరమైన అన్ని రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి, తక్కువ క్యాలరీలతో ఎక్కువ ప్రోటీన్ పొందడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.

2 / 5
ఆకలిని నియంత్రించే శక్తి: బాయిల్డ్ ఎగ్స్‌లో కడుపు నిండిన అనుభూతిని కలిగించే గుణం ఎక్కువ. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధన ప్రకారం.. ఉదయం పూట కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునే వారి కంటే, గుడ్లు తినే వారు రోజంతా తక్కువ క్యాలరీలను తీసుకుంటున్నట్లు తేలింది. దీనితో పాటు ఇందులో లభించే విటమిన్ B12 మెటబాలిజానికి, విటమిన్ D ఎముకల ఆరోగ్యానికి, కోలిన్ మెదడు పనితీరుకు ఎంతగానో తోడ్పడతాయి.

3 / 5
ఆమ్లెట్: మరోవైపు ఆమ్లెట్ అనేది కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా రుచిని, వైవిధ్యాన్ని ఇష్టపడే వారికి అద్భుతమైన ఎంపిక. బేస్ ప్రోటీన్ పరంగా చూస్తే ఒక గుడ్డుతో చేసే ఆమ్లెట్‌లోనూ 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కానీ మనం దానిని ఎలా తయారు చేస్తున్నామనే దానిపైనే దాని పోషక విలువలు ఆధారపడి ఉంటాయి. చీజ్ లేదా ప్రాసెస్ చేసిన మాంసం వంటివి జోడిస్తే క్యాలరీలు, కొవ్వు పదార్థాలు పెరుగుతాయి. అదే కేవలం ఒక స్పూన్ నూనెతో పాటు కూరగాయలు జోడిస్తే అది అత్యంత ఆరోగ్యకరమైనదిగా మారుతుంది.

4 / 5
వెజిటబుల్ ఆమ్లెట్: పాలకూర, బెల్ పెప్పర్స్, ఉల్లిపాయలు, పుట్టగొడుగులు వంటి కూరగాయలతో చేసే ఆమ్లెట్ బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కూరగాయలు క్యాలరీలను పెంచకుండానే ఆహారం పరిమాణాన్ని పెంచుతాయి. దీనివల్ల ఎక్కువ సమయం కడుపు నిండినట్లు ఉండి, జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. మధ్యమధ్యలో స్నాక్స్ తినాలనే కోరికలు తగ్గుతాయి.

5 / 5
ప్రోటీన్ - బరువు తగ్గే విషయంలో ఏది బెస్ట్?: ప్రోటీన్ పరంగా చూస్తే రెండింటిలోనూ పెద్ద తేడా లేదు. ఒక గుడ్డు బాయిల్డ్ చేసినా, ఆమ్లెట్ వేసినా 6 గ్రాముల ప్రోటీనే వస్తుంది. అయితే మీరు క్యాలరీలను చాలా ఖచ్చితంగా లెక్కించుకునే వారైతే, ఎలాంటి అదనపు కొవ్వులు లేని ఉడుకబెట్టిన గుడ్డు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. కానీ ఎక్కువ ఆహారం తిన్న అనుభూతి కలిగి, ఆకలి వేయకుండా ఉండాలంటే వెజ్ ఆమ్లెట్ మేలైనది. అందుకే న్యూట్రిషనిస్టులు మీ రోజువారీ అవసరాలను బట్టి ఈ రెండింటినీ మార్చి మార్చి డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

Follow Us