రోజూ గుప్పెడు నల్ల శనగలు తింటే… శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే ఇప్పుడే మొదలుపెట్టేస్తారు..!

Updated on: Sep 22, 2026 | 9:28 AM

మన భారతీయ వంటకాల్లో తరచూ ఉపయోగించే ధాన్యాలలో నల్ల శనగలు ఒకటి. కేవలం రుచిలోనే కాదు, పోషకాల విషయంలోనూ నల్ల శనగలు అగ్రస్థానంలో ఉంటాయి. వీటిలో జింక్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి ఆవశ్యక ఖనిజాలతో పాటు అధిక మొత్తంలో ప్రోటీన్, పీచు పదార్థాలు ఉంటాయి. క్రమం తప్పకుండా నల్ల శనగలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5
జింక్, మెగ్నీషియంల గని: నల్ల శనగల్లో ఉండే జింక్ మన శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. అలాగే, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో, నరాల వ్యవస్థను ఉత్తేజపరచడంలో, ఎముకల బలానికి ఎంతో దోహదపడుతుంది.

2 / 5
మధుమేహ నియంత్రణ : నల్ల శనగలలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇవి తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగవు. వీటిలోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి.

3 / 5
గుండె ఆరోగ్యానికి మేలు: వీటిలో ఉండే కరిగే పీచు పదార్థం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం గుండె పనితీరును మెరుగుపరిచి, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.ఐరన్ లోపంతో బాధపడేవారికి, ముఖ్యంగా మహిళలకు నల్ల శనగలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచి, రక్తహీనత సమస్యను నివారిస్తాయి.

4 / 5
బరువు తగ్గడానికి దోహదం: నల్ల శనగలలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తింటే కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. ఇది తరచూ ఆకలి వేయకుండా చూస్తుంది, ఫలితంగా అధికంగా ఆహారం తీసుకోకుండా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

5 / 5
ఎలా తీసుకోవాలి?: నల్ల శనగలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే మొలకెత్తిన విత్తనాలుగా తీసుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఉడకబెట్టి చాట్ రూపంలో లేదా కూరగా చేసుకుని కూడా తినవచ్చు.
అతి తక్కువ ఖర్చుతో శరీరానికి కావలసిన సమగ్ర పోషకాలను అందించే నల్ల శనగలను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు!

ఎలా తీసుకోవాలి?: నల్ల శనగలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే మొలకెత్తిన విత్తనాలుగా తీసుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఉడకబెట్టి చాట్ రూపంలో లేదా కూరగా చేసుకుని కూడా తినవచ్చు. అతి తక్కువ ఖర్చుతో శరీరానికి కావలసిన సమగ్ర పోషకాలను అందించే నల్ల శనగలను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు!

Loading...
Unable to load recommendations.
Follow Us