
పచ్చని కాపురంలో చిచ్చు పెట్టేవి ఉన్నప్పుడు ఇంక ఎక్కడ కలిసి ఉంటారు. నిజం చెప్పాలంటే మగవాళ్ళు చేసే కొన్ని తప్పులే వల్లే పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయని చెప్పకనే చెబుతున్నారు. ఆ తప్పులేంటో యెక్కడ చూద్దాం..

భార్యతో స్పెండ్ చేయకపోవడం : పెళ్లికి ముందు మంచిగా ఉన్న భర్త, పెళ్ళి తర్వాత కట్టుకున్న భార్యతో సమయం గడపడానికి ఇష్టం పడటం లేదు. దీని వలన ఇద్దరి మధ్య గ్యాప్ మొదలయ్యి భార్య ఒంటరిగా ఉన్నానని ఫీల్ అయ్యి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడుతుంది.

బట్టల విషయంలో కొత్త రూల్స్: ఎవరికీ నచ్చిన డ్రస్సులు వాళ్లు వేసుకునే స్వేచ్ఛ అందరికి ఉంటుంది. చీరలే కట్టాలి, డ్రెస్సులు వేసుకోకూడదు అని కొత్త కొత్త రూల్స్ పెడితే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది.

బంధువుల ముందు చులకన చేసి మాట్లాడటం: భర్తలు బంధువుల ముందు భార్యలను తక్కువ చేసి మాట్లాడతారు. దీని వలన వాళ్లు చాలా బాధ పడతారు. మా ఆవిడ ఏ పనులు సరిగా చెయ్యదని అందరి ముందు అంటే వారికీ అవమానకరంగా ఉంటుంది. దాని వలన మీతో ఉండటానికి ఆసక్తి చూపరు.

అనుమానం: బంధంలో ఇద్దరూ సమానమే. ఒకరు ఎక్కువగా ఇంకొకరు తక్కువ కాదు. భార్య బయటకు వెళ్తే భర్త ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళావ్? ఎంత సేపటిలో వస్తావ్ అంటూ ప్రతి సారి ఆమెను విసిగిస్తే ఇంత అనుమానం ఉన్న భర్తతో ఉండటం అవసరమా అని విడాకులు ఇచ్చేస్తుంది.