చలి కాలంలో వచ్చే దగ్గు, కఫం తగ్గించుకోవడానికి పూర్వం మన పెద్దలు వాడిన ఆకులు ఇవే!

Updated on: Nov 20, 2026 | 12:47 PM

ఇటీవల కాలంలో ఎంతో మంది దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలు రావడం మనం చూస్తూనే ఉన్నాము. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు దగ్గు, జలుబుతో ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అందులోనూ ఇప్పుడు చలికాలం కావడంతో ఈ సమస్యలు త్వరగా తగ్గడం లేదు. మరి, ఈ చలికాలంలో దగ్గు, కఫం నుంచి మనల్ని మనం ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5
దగ్గు, కఫం నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ చిట్కాలను పాటించవచ్చు. దగ్గులో రెండు రకాలు ఉంటాయి. అవి పొడి దగ్గు, కఫంతో కూడిన దగ్గు. ఈ రెండు రకాల దగ్గులను తగ్గించడానికి ఇంటి చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం.

3 / 5

పొడి దగ్గు వస్తున్నవారు కరక్కాయను చిన్నగా దంచి, ఒక చిన్న ముక్కను పంటి కింద పెట్టుకుని మెల్లిగా నములుతూ రసాన్ని మింగాలి. ఇలా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తీసుకున్నట్లయితే పొడి దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.అలాగే పొడి దగ్గు వస్తున్నప్పుడు రెండు లవంగాలను పంటి కింద పెట్టుకుని మెల్లిగా నములుతూ ఆ రసాన్ని మింగాలి. ఇలా చేయడం వల్ల పొడి దగ్గు నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.అలాగే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి బాగా కలిపి, ఆ నీటితో పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గి ఉపశమనం పొందుతారు.

4 / 5
తమలపాకు, తేనె చిట్కా:  ఒక తమలపాకు తీసుకుని దాని తొడిమను తీసేయాలి. దానికి ఒక స్పూన్ తేనె బాగా రాసి మడత పెట్టుకోవాలి. ఆ తర్వాత బాగా నమిలి, రసాన్ని మింగాలి. ఇలా రెండు రోజుల పాటు చేసినట్లయితే కఫంతో కూడిన దగ్గు నుంచి ఉపశమనం  దొరుకుతుంది. చిన్నపిల్లల విషయానికి వస్తే, ఒక స్పూన్ తులసి ఆకు రసంలో రెండు మూడు చుక్కల తేనె కలిపి ఉదయాన్నే తాగించినట్లుయితే కొంత ఉపశమనం కలుగుతుంది.

5 / 5
తేనె, లవంగాల పొడితో కూడా ఈ దగ్గును తగ్గించుకోవచ్చు. అర టేబుల్ స్పూన్ తేనెలో మీరు దంచి పెట్టుకున్న లవంగాల పొడి కలిపి తీసుకోవాలి. ఇలా రెండు మూడు రోజుల పాటు తీసుకుంటే కఫం బయటకు రావడానికి, దగ్గు తగ్గడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us