వివిధ రకాల చర్మ సంరక్షణ సమస్యలకు నిమ్మరసం చక్కటి పరిష్కారం. నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ముఖం నుండి నల్ల మచ్చలు, టాన్ తొలగించడంలో సహాయపడుతుంది. తేనె మరొక ఆర్గానిక్ బ్లీచింగ్ ఏజెంట్, ఇది టాన్ వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఒక చెంచా తేనె, ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ని వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయండి.