
బొప్పాయిలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి9, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ బి1, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియ, జుట్టు, చర్మానికి మేలు చేస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో లేదా అల్పాహారం సమయంలో బొప్పాయి పండును తినడం ఉత్తమం. ఇది రోజంతా జీర్ణవ్యవస్థలో సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

రాత్రి సమయంలో: పేగులను డిటాక్సీఫై చేయడానికి రాత్రిపూట కూడా తినవచ్చు. కానీ భోజనం చేసిన వెంటనే పండ్లు తినకూడదు. భోజనానికి, పండు తినడానికి ధ్య కనీసం 3 నుండి 4 గంటల విరామం ఉండాలి.

జీర్ణక్రియకు అమృతం: బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక సహజ ఔషధం. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి శరీరానికి రోగనిరోధక కవచంలా పనిచేస్తుంది. వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జలుబు వంటి సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారికి: బొప్పాయిలో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది, తద్వారా అతిగా తినడాన్ని అరికట్టి బరువు తగ్గడానికి సహకరిస్తుంది.

గుండె ఆరోగ్యాం - మెరిసే చర్మం: ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు, మొటిమలు, నల్లటి మచ్చలను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా తింటే చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. అంతేకాకుండా పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది రక్తపోటును తగ్గించి గుండె జబ్బుల ముప్పును నివారిస్తుంది.