
కావాల్సిన పదార్థాలు : పెసరపప్పు, వెల్లిపాయ రెబ్బలు కప్పు, జీలకర్ర, కారం, ఉప్పు రుచికి సరిపడ, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ తరిగినవి కప్పు, ఎండు మిర్చి,మెంతి పొండి, నూనె, నీళ్లు, చింత పండు.

తయారీ విధానంలోకి వెళితే..ముందుగా చింత పండు తీసుకోవాలి. దీనిని శుభ్రంగా కడిగి ఒక బౌల్‌లో వాటర్ పోసి నానబెట్టాలి. చింత పండు ఎంత ఎక్కువ సేపు నానితే రసం అంత ఎక్కువగా వస్తుంది. దీని వలన చారు చాలా రుచిగా ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా చింత పండు పులుపు నార్మల్‌గా ఉన్నది తీసుకోవాలి. పులుపు ఎక్కువగా ఉన్నా పప్పు చారు టేస్టీగా ఉండదు.

తర్వాత పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పును శుభ్రంగా కడిగి నానబెట్టాలి. తర్వాత దీనిలో నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. అది ఉడికే సమయంలో మనం వెల్లుల్లి రెబ్బలు తీసుకొని, అందులో జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్‌ను పప్పులో వేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు పోసి ఈ పప్పు మెత్తగా టేస్టీగా ఉడకబెట్టుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, మెంతి పొడి కూడా వేసుకోవాలి.

పప్పు బాగా మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాలు స్టవ్‌పై ఉంచాలి. తర్వాత చిటికెడు పసుపు కూడా వేయాలి. మరో రెండు నిమిషాలు పప్పును ఉడకబెట్టుకోవాలి. ఇది పూర్తిగా ఉడికిన తర్వాత దీనిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముద్దపప్పు పూర్తి అయినట్లే. ఇప్పుడు మనం చారు ప్రిపేర్ చేసుకోవాలి.

దీని కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో నూనె పోయాలి. నూనె పోసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు , కరివేపాకు, ఎండు మిర్చీ, అన్నీ వేసి పోపు పెట్టుకోవాలి. దీని కంటే ముందు చింత పండు రసం తీసుకోవాలి. అందులో కారం, ఆనియన్స్ , ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ముద్దపప్పు చారు రెడీ.