Best Seasonal Fruits: ఈ ఐదు పండ్లతో రోగ నిరోధక శక్తికి బూస్ట్.. శరీరానికి మరింత మేలు

|

Feb 16, 2023 | 6:00 PM

వసంతకాలం అంటేనే వివిధ రకాల పండ్లకు సీజన్. ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే అన్ని పండ్లు మరేకాలంలోనూ రావు. తాజా పండ్లను, కూరగాయాలను విరివిగా తింటే చాలా మేలని నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా పోషకాహార నిపుణులు శరీర బరువు నిర్వహణకు, అలాగే బరువు తగ్గాలనుకునేవారు సీజనల్‌గా దొరికే పండ్లను తినమని సూచిస్తుంటారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి మెరుగవ్వడానికి సీజనల్‌ ఫ్రూట్స్ తింటే చాలా మంచిది. ఈ సీజన్‌లో దొరికే ఐదు పండ్లను తింటే శరీరానికి చాలా మేలు చేసినట్లు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. వారు సూచించే ఐదు పండ్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

1 / 5
చెర్రీస్ వసంత రుతువు చివరిలో దొరికే పోషకాలు అధికంగా ఉండే పండు.  ఫైబర్, విటమిన్ సి, యాంటిఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇవి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో బాగా పని చేస్తాయి.

2 / 5
స్ట్రాబెర్రీల్లో విటమిన్లు సి, కె, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంతో పాటు శరీరంలోని మంటను తగ్గించడానికి సాయం చేసే యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

3 / 5
పైనాపిల్స్ వేసవిలో దొరికే చాలా మంచి పండు. ఇందులో విటమిన్ సి, మాంగనీస్, బ్రోమెలైన్ వంటివి ఉంటాయి. పైనాపిల్స్ తినడం వల్ల జీర్ణక్రియలో మంటను తగ్గించే ఎంజైమ్‌లను రిలీజ్ చేయడలో సాయం చేస్తాయి.

4 / 5
ఆప్రికాట్లు వసంత రుతువు చివరిలో దొరుకుతాయి. ఇందులో కంటి ఆరోగ్యానికి సాయం చేసే విటమిన్ ఎ, రక్తపోటు నియంత్రించడానికి పొటాషియం నిల్వలు అధికంగా ఉంటాయి.

5 / 5
కివి ఫ్రూట్ కూడా వసంత రుతువులో దొరికే అద్భుతమైన ఫలం. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆక్టినిడిన్ అనే ప్రత్యేకమైన ఎంజైమ్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సాయం చేయడంతో పాటు జీర్ణశయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి.