Phool Makhana: పాలలో మఖానా కలిపి తాగితే ఇలాంటి అద్భుతమైన ప్రయోజనాలన్నీ మీ సొంతం..!

Updated on: Mar 04, 2025 | 9:00 AM

ఫాక్స్ నట్స్ పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. అందుకే దీనిని ఎక్కువగా తింటారు. మఖానాను పాలలో లేదా పాలతో కలిపి నానబెట్టి తింటారు. ఇది ఆరోగ్యానికి సూపర్‌ ఫుడ్‌ అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇది శరీరం, ఎముకలను బలపరుస్తుందని చెబుతారు. మఖానాను పాలతో కలిపి తింటే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఉపవాస సమయంలో, డయాబెటిక్ రోగులు, బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్న మహిళలు కూడా చక్కెర లేకుండా పాలతో మఖానాను తీసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. పూర్తి బెనిఫిట్స్‌ తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

1 / 5
Makhana With Milk

Makhana With Milk

2 / 5
మఖానాని పాలలో నానబెట్టి తినడం వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. పాలు, మఖానా రెండింటిలోనూ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎముకలు బలంగా మారతాయి. వృద్ధాప్యంలో వచ్చే ఎముకల సమస్యల్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

3 / 5
మఖానా అలా నేరుగా కాకుండా పాలలో నానబెట్టి తింటే రెట్టింపు లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. పాలలోని ప్రోటీన్, కాల్షియం, మఖానాలోని ఫైబర్‌తో కలిసి సూపర్‌ఫుడ్‌గా మారుతుంది. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా మారుతుంది. దీని వల్ల శరీరం కూడా ఎనర్జీగా ఉంటుంది.

4 / 5
మఖానాకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీంతో మఖానా రక్తంలోకి గ్లుకోజ్ విడుదలను నెమ్మది చేస్తుంది. దీనివల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. డయాబెటిస్ పేషెంట్లకు కూడా ఇది మంచి స్నాక్. మఖానాను పాలతో కలిపి తీసుకుంటే గుండెకు మేలు జరుగుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5 / 5
పూల్‌ మఖానా పాలలో కలిపి తీసుకోవడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియలో తోడ్పడుతుంది. దీంతో మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా కడుపుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. అదనపు శక్తి లభిస్తుంది. అలసట తగ్గుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.