Mens Fashion Tips: అబ్బాయిలు.. హ్యాండ్‎సమ్‎గా కనిపించాలా? ఎలాంటి బట్టలు వేసుకోవాలంటే.?

|

Sep 04, 2024 | 1:51 PM

నేటి కాలంలో డ్రెస్సింగ్ సెన్స్ చాలా ముఖ్యమైన అంశంగా మారింది. ప్రజలు మీ డ్రెస్సింగ్ స్టైల్‌ను బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం ప్రారంభించారు. అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఫ్యాషన్ పరిజ్ఞానం తక్కువగా ఉందని గమనించవచ్చు. ఇలాంటి సమయంలో, మీరు మీ డ్రెస్సింగ్ గురించి గందరగోళంగా ఉంటే, స్టైలిష్, కూల్ లుక్ పొందాలనుకుంటే.. మీ స్టైల్‌కు మరింత మెరుగులు దిద్దుకోండి. ఇప్పుడు ఎలాంటి బట్టలు వేస్తుకుంటే స్టైలిష్‌గా కనిపిస్తోరో అనే 5 సులభమైన చిట్కాలను ఇవాళ మనం తెలుసుకుందాం.

1 / 5
సరైన రంగు బట్టలు ఎంచుకోండి: స్టైలిష్ గా కనిపించాలంటే దుస్తుల రంగుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జీన్స్,షర్ట్ లేదా టీ-షర్టు రంగుతో సరిపోలండి లేదా కాంట్రాస్ట్ కలర్ ధరిస్తే ఆకర్షణీయంగా, స్టైలిష్‌గా కనిపిస్తారు. మీరు ఏ రంగు బట్టలు బాగా కనిపిస్తారో కూడా ఒకటికి.. పదిసార్లు చెక్ చూసుకోండి.

2 / 5
సరైన సైజు దుస్తులను ఎంచుకోండి: సరైన సైజు బట్టలను ధరించడం చాలా ముఖ్యం. మీరు వదులుగా ఉన్న దుస్తులలో లావుగా కనిపిస్తారు. అందుకే మీకు సరిపడే దుస్తులను ధరిస్తే మరిత లుక్ పెరుగుతుంది. అసౌకర్యంగా ఉండే దుస్తువలను అస్సలు ఎంపిక చేసుకోవద్దు.

3 / 5
  బట్టలు ద్వారా బూట్లు జతను ఎంచుకోండి: మీ బూట్లు మీ దుస్తులకు సరిపోలాలి. ఉదాహరణకు, మీరు స్పోర్ట్స్ దుస్తులను ధరించినట్లయితే దానితో పాటు స్పోర్ట్స్ షూలను ధరించండి. మంచి బూట్లు మొత్తం రూపాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే మీ వ్యక్తిత్వాన్ని ఆకర్షణీయంగా మార్చుతాయి.

4 / 5
 కేశాలంకరణ, గడ్డం ఆకర్షణీయంగా ప్లాన్ చేయండి: ఎంత స్టైలిష్‌ దుస్తులు వేసుకున్న మీ కేశాలంకరణ సరిగ్గా లేకుంటే మొత్తం రూపాన్ని పాడు చేస్తుంది. స్టైలిష్‌గా కనిపించాలంటే, మీ హెయిర్‌స్టైల్, గడ్డాన్ని మెయింటెయిన్ చేయాలి. ఇది మిమ్మల్ని ఆకర్షణీయంగా, స్టైలిష్‌గా చేస్తుంది. మీ విశ్వాసాన్ని మరింత పెంచుతుంది.

5 / 5
వీలయినంత వరకు V-నెక్ ధరించండి: టీ-షర్టుల వంటివి వేసుకున్నప్పుడు.. V నెక్ డ్రెస్‌లను ఎంచుకోండి. ఇవి స్లిమ్‌గా కనిపించడంలో సహాయపడతాయి. మీ బట్టలు చాలా పొడవుగా ఉండకుండా జాగ్రత్త వహించండి. టీ షర్టు పొడవు మిమ్మల్ని లావుగా చేస్తుంది. అలాగే వేరే నెక్ డిజైన్ వేసుకున్నా లావుగా కనిపించవచ్చు.