నోరూరించే చికెన్ పచ్చడి.. ఇలా పెడితే టేస్ట్ అదుర్సే

Updated on: Jul 30, 2026 | 8:50 PM

చికెన్ పచ్చడి ఇష్టపడే వారికి నోరూరించే రుచిని అందించే రెసిపీ ఇది. బోన్ లెస్ చికెన్‌ను శుభ్రం చేసి, మసాలాలతో కలిపి నూనెలో వేయించాలి. వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వంటివి చేర్చి, తగినంత కారం, నిమ్మరసంతో కలపాలి. ఈ సాధారణ పద్ధతిలో ఇంట్లోనే స్పైసీ, టేస్టీ చికెన్ పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకుని చాలా రోజులు తినవచ్చు.

1 / 5
కావాల్సిన పదార్థాలు : బోన్ లెస్ చికెన్,  వెల్లుల్లి రెబ్బలు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, గరం మసాలా, నిమ్మకాయలు, ఉప్పు, నూనె, వీలైతే కరివేపాకు.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా బోన్ లెస్ చికెన్ తీసుకోవాలి. దానిని గోరు వెచ్చటి నీరులో నిమ్మకాయ కలిపి అందులో శుభ్రం చేయాలి. తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకోవాలి. అందులో చికెన్ ముక్కలు వేయాలి.

3 / 5
తర్వాత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, అన్నీ వేసి మంచిగా కలపాలి. పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో ఆయిల్ వేసి, మంచిగా వేడి అయ్యే వరకు చూసుకోవాలి. నూనె వేడి అయిందంటే చాలు అందులో ఈ చికెన్ ముక్కలు వేసుకోవాలి.

4 / 5
నూనెలో చికెన్ ముక్కలు వేసి మంచిగా వేయించుకోవాలి.  బంగారు రంగు వచ్చి బాగా వేగే వరకు ముక్కలు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో కరివేపాకు , జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి.

5 / 5
తర్వాత చికెన్ ముక్కలు వేసి మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత అందులో సరిపడ కారం, నిమ్మకాయ రసం , గరం మసాలాలు వేసి మంచిగా కలిపి గాలి చొరబడని గాజు సీసాలో వేసి నింపుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ చికెన్ పచ్చడి రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us