
బెండకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పావుకిలో బెండకాయలు, ఒక ఉల్లిపాయ, 10 పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయంత చింతపండు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అలాగే తాలింపు కోసం అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, రెండు ఎండు మిర్చి, నాలుగు కరివేపాకులు తీసుకోవాలి.

బెండకాయ రోటి పచ్చడి తయారీ విధానం: ముందుగా బెండకాయలను తీసుకుని బాగా కడిగి వాటిని బాగా ఆరనివ్వాలి. ఇంకా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ పెట్టుకోవాలి. పాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసి అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ధనియాలు, నాలుగు పచ్చిమిర్చి, నాలుగు వెల్లుల్లి కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.

అదే పాన్‌లో ఇంకో స్పూన్ ఆయిల్ వేసి నాలుగు బెండకాయ ముక్కలను వేసి బాగా వేయించాలి. ఇంకా ఈ బెండకాయలో జిగురు పూర్తిగా పోయి వాటిని గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి రెండు నిమిషాల వేయించాలి. ఇంకా వీటితో పాటు చింతపండును కూడా కొద్దీ పాటు నానబెట్టి రెడీ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీలో వీటిని బాగా వేయించి ఇంకా వీటితో పాటు కొద్దిగా జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, నాలుగు పచ్చిమిర్చి, నాలుగు వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, వీటిలో ఉప్పు వేసి మెత్తగా పట్టుకోవాలి. ఆ తరవాత వేయించిన బెండకాయకాను వేసి రోటిలో దంచుకోవడమే. మిక్సీ పట్టుకున్న పచ్చడిని దీనిలో కొద్దిగా దంచుకోవాలి. చివర్లో ఈ తాలింపు వేసి మంచిగా కలిపితే టేస్టీ టేస్టీ బెండకాయ రోటి పచ్చడి రెడీ.

రాగి సంకటి, జొన్న రొట్టెలోకి సూపర్ : మిక్సీలో వీటిని మెత్తగా చేయకుండా కచ్చా పచ్చాగా దంచితే మంచి రుచి వస్తుంది. ఇంకా ఈ బెండకాయ రోటి పచ్చడిని వేడి వేడి అన్నంలో కలిపి తింటే డబుల్ రుచితో మంచిగా ఉంటుంది. అంతే కాదు, వీటిని రాగి సంకటి, జొన్న రొట్టెలు, చపాతీలతో తింటే వదలకుండా తింటారు.