అరటిపండు vs నారింజ: ఉదయం ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..? తినేముందు తెలుసుకోండి..

Updated on: Apr 16, 2026 | 10:45 AM

Banana vs Orange: చాలామంది ఉదయం నిద్రలేవగానే తక్షణ శక్తి కోసం ఏదో ఒక పండు తింటుంటారు. అయితే అల్పాహారంలో అరటిపండు తీసుకోవాలా లేక నారింజ పండు తీసుకోవాలా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ రెండు పండ్లు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, వీటిని ఎప్పుడు, ఎలా తినాలో తెలిస్తేనే పూర్తి ప్రయోజనాలు అందుతాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

1 / 5
తక్షణ శక్తికి అరటిపండు: అరటిపండులో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణమే గ్లూకోజ్‌ను అందించి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడతాయి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

2 / 5
జీర్ణక్రియ: అరటిపండులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఖాళీ కడుపుతో కేవలం అరటిపండును మాత్రమే తింటే కొంతమందిలో కడుపు ఉబ్బరం రావచ్చు. అందుకే వీటిని నట్స్ లేదా ఇతర ఆహారాలతో కలిపి తీసుకోవడం ఉత్తమం.

3 / 5
రోగనిరోధక శక్తికి నారింజ: నారింజలో సుమారు 87 శాతం నీరు ఉంటుంది. రాత్రంతా నిద్రపోయి లేచిన తర్వాత డీహైడ్రేషన్‌కు గురైన శరీరానికి ఇది మంచి తేమను అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. అలాగే చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది.

4 / 5
ఎసిడిటీ ముప్పు: నారింజలో ఆమ్ల గుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గ్యాస్ట్రిక్ లేదా ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో నారింజ లేదా దాని రసాన్ని తీసుకోకపోవడమే మంచిది. అల్పాహారం పూర్తిగా తిన్న తర్వాత నారింజ పండును తీసుకోవడం ఆరోగ్యకరం.

5 / 5
ఏది బెస్ట్: మీరు ఉదయం వర్కౌట్స్ చేసే వారైతే తక్షణ శక్తి కోసం అరటిపండు ఉత్తమ ఎంపిక. అలా కాకుండా, శరీరానికి విటమిన్-సి, హైడ్రేషన్ అవసరం అనుకుంటే అల్పాహారం తర్వాత నారింజ తీసుకోవడం మంచిది. అయితే ఏ పండు తిన్నా, అది అతిగా కాకుండా మితంగా తీసుకున్నప్పుడే ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుంది.

Follow Us