
అరటి పండు మాత్రమే కాకుండా అరటి పువ్వులో కూడా శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. ఇంకా దీనిలో ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీర ఇమ్యూనిటీ పవర్ లో పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి. వీటితో గారెలు చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. అరటి పువ్వు గారెలను మీ ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి

అరటి పువ్వు గారెలకు కావలసిన పదార్థాలు: అరటి పువ్వు తరుగు, ఒక కప్పు శనగపప్పు, ఒక చిన్న ఉల్లిపాయ , నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లంపేస్ట్, ఒక కప్పు కరివేపాకు , అర కట్ట కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు , రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం, నూనెను తీసుకోవాలి.

అరటి పువ్వు గారెలకు తయారీ విధానం: ముందుగా శనగపప్పును మూడు గంటల పాటు వీటిని నానబెట్టాలి. ఇంకా అరటి పువ్వును తీసుకుని శుభ్రం చేసి దానిని చక్కగా తరిగి దానిలో ఉప్పు వేసి పెట్టాలి. ఆ తరవాత నానిన శనగపప్పు, నాలుగు పచ్చిమిర్చి, అల్లంతో మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి.

ఈ మిశ్రమంలో అరటి పువ్వు తరుగు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నాలుగు కరివేపాకు, అర కట్ట కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ కారం, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. పాన్ లో ఆయిల్ వేసి చిన్న చిన్న గారెలలా వీటిని చిన్నగా చేసుకోవాలి. ఆ తరువాత రెండు వైపులా గోల్డ్ రంగు మారే వరకు బాగా వేయించాలి.

అరటి పువ్వు గారెలు ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటిని తినడం వలన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇంకా శరీరానికి కూడా కావాల్సినంత ఐరన్ దొరుకుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారికీ కూడా ఇది సూపర్ ఫుడ్ . జీర్ణక్రియ పని తీరు మెరుగుపడుతుంది. ఇంకా అలసట కూడా తగ్గుతుంది.