అరటి పువ్వు అద్భుతాలు.. మధుమేహ నియంత్రణలో లక్ష్మణ రేఖ! వారానికి ఒక్కసారైనా తింటే

Updated on: Aug 06, 2026 | 10:41 AM

మనదేశంలో అరటి చెట్టులోని ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఉంది. అరటి పండ్లు, అరటి కాయలు తినడం, అరటి ఆకులో భోజనం చేయడం మన సంప్రదాయంలో భాగం. అయితే చాలామంది అరటి పువ్వును వంటల్లో వాడేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. నిజానికి ఆయుర్వేదం, ఆధునిక పోషకాహార శాస్త్రం ప్రకారం అరటి పండు కంటే అరటి పువ్వులోనే అత్యధిక పోషకాలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.

1 / 5
రక్తహీనత నివారణ: అరటి పువ్వులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి, హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు అరటి పువ్వును క్రమం తప్పకుండా వంటకాల రూపంలో తీసుకోవడం చాలా మంచిది.

2 / 5
మధుమేహం నియంత్రణ: డయాబెటిస్ బాధితులకు అరటి పువ్వు ఒక వరప్రసాదం. ఇది రక్తంలో గ్లూకోజ్ నిదానంగా విడుదలయ్యేలా చేసి, బ్లడ్ షుగర్ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి.

3 / 5
మహిళల ఆరోగ్యానికి మేలు: మహిళల్లో వచ్చే నెలసరి సమస్యలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే తీవ్రమైన కడుపునొప్పి, అధిక రక్తస్రావాన్ని తగ్గించడంలో అరటి పువ్వులోని ప్రొజెస్టెరాన్ హార్మోన్ ప్రేరేపక గుణాలు తోడ్పడతాయి. పాలిచ్చే తల్లులకు కూడా ఇది మంచి ఆహారం.

4 / 5
మెరుగైన జీర్ణశక్తి, బరువు తగ్గింపు: అరటి పువ్వులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ వేగవంతమవుతుంది. మలబద్ధకం సమస్య దూరమవుతుంది. తక్కువ కేలరీలు, ఎక్కువ పీచు ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి బరువు తగ్గాలనుకునేవారికి సహకరిస్తుంది.

5 / 5
కిడ్నీలు, గుండె ఆరోగ్యం: ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే అరటి పువ్వులోని కిడ్నీ ప్రొటెక్టివ్ గుణాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడతాయి. అరటి పువ్వు పైన ఉన్న రేకులను తొలగించి, లోపలి పూలను శుభ్రం చేసి పెసరపప్పుతో కలిపి కూరగా, ఫ్రైగా లేదా పప్పులో వేసి వండుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us