
సమ్మర్ బాదం మిల్క్ కు కావాల్సిన పదార్దాలు: 10 బాదం, రెండు గ్లాసులు పాలు , 150 గ్రాములు బెల్లం లేదా రెండు టేబుల్ స్పూన్స్ చక్కెర , యాలకుల పొడి పావు టీ స్పూన్, కొద్దిగా కుంకుమపువ్వు , అర టేబుల్ స్పూన్ గులాబ్ నీరు, ఇంకా ఒక కప్పు ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి. ఇంకా దీనిలో కిస్ మిస్ లు, జీడి పప్పులు వేస్తె చాలా టేస్టీగా ఉంటుంది.

సమ్మర్ బాదం మిల్క్ కు తయారీ విధానం: ముందుగా బాదంను తీసుకుని కనీసం 8 గంటలు వీటిని మంచి నీటిలో నానబెట్టాలి ఆ తరువాత ఇవి తీసుకుని తొక్క తీసి పేస్ట్‌లాగా చేయడానికి మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఆ తరవాత ఒక గిన్నెలో పాలను పోసి వాటిని బాగా మరిగించాలి. ఇంకా దానిలో కుంకుమపువ్వు కూడా వేసి 10 నిమిషాల పాటు బాగా మగ్గించాలి

ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి: మరిగిన పాలలో ఈ బాదం పేస్ట్ వేసి 10 నిమిషాల పాటు మీడియం మంటపై బాగా ఉడికించాలి ఇంకా దీనిలో బెల్లం లేదా చక్కెరను కూడా వేసి కలుపుకోవాలి. ఇంకా యాలకల పొడి, గులాబ్ నీరును కూడా బాగా మిక్స్ చేయాలి. అయితే, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి.

దీనిని మీరు చల్లగా తాగొచ్చు, వేడిగా తాగొచ్చు: మీరు కావాలంటే వేడిగా కూడా తాగొచ్చు లేదా చల్లగా కూడా దీనిని తాగొచ్చు ఇంకా దీనిని ఐస్ క్యూబ్స్‌తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీని పైన కిస్ మిస్ లు, బాదం పప్పులు వేసుకుంటే రుచి అదిరిపోతోంది. సరైన కొలతలతో మీ ఇంట్లో చేసుకునేటప్పుడు దీనిని ఫాలో అవ్వండి.

ఇది ఒక గ్లాస్ తాగితే హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో.. ఇంకా ఇది శరీరానికి చల్లదనం ఇస్తుంది. ఇమ్యూనిటీని కూడా వెంటనే పెంచుతుంది. అలసట, నీరసం కూడా దెబ్బకు పారిపోతోంది. ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరగడానికి ఎంతో మేలుచేసే డ్రింక్. సమ్మర్లో బెల్లం వాడితే ఇంకా చాలా మంచిది. మరి వేడిగా కాకుండా కూల్‌గా తాగితే మంచి టేస్ట్ ఉంటుంది.