
Baba Vanga Predictions for 2026: బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త, కాలజ్ఞానిగా ప్రసిద్ధి చెందిన బాబా వంగా (వాంజెలియా పాండేవా గుష్టెరోవా) 2026 సంవత్సరానికి తన అంచనాలు తెలియజేశారు. ఆమె 1996లోనే మరణించినప్పటికీ.. ఆమె చెప్పిన చాలా విషయాలు ఇప్పటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా అంచనాలు వేశారు. ఆర్థిక మాంద్యం, ఆర్థిక అస్థిరతకు సంబంధించిన కొన్ని సంచలన విషయాలను తెలియజేశారు. ఎక్స్‌ప్రెస్, స్కైహిస్టరీ నివేదిక ప్రకారం.. 2026 సంవత్సరానికి సంబంధించిన ఆమె అంచనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్థిక మాంద్యం, అస్థిరత బాబా వంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా అంచనాలు వేశారు. 2026కి సంబంధించిన ఈ అంచనాలు.. ఆర్థిక మాంద్యం, ఆర్థిక అస్తిరతను సూచిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆర్థిక అస్థిత కొనసాగింపు గురించి ఆమె హెచ్చరించారు.

సంక్షోభాలు బాబా వంగా అంచనాల ప్రకారం.. 2026లో బ్యాంకులపై ఒత్తిడి పెరగవచ్చు. దీని వలన బ్యాంకులు విఫలం కావచ్చు. అంతేగాక, కరెన్సీలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. స్టాక్ మార్కెట్లు పడిపోవచ్చు. ద్రవ్యోల్బణం వేగంగా పెరగవచ్చు. ఇదే జరిగితే.. ప్రపంచ మార్కెట్లకు అనిశ్చితి పెరుగుతుంది.

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు 2026 కోసం బాబా వంగా అంచనాలు.. తైవాన్, దక్షిణ చైనా సముద్రం, భారతదేశం-చైనా సరిహద్దులలో పెద్ద ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు. కొత్త పొత్తులు, ప్రాంతీయ విస్తరణ వాదం ప్రపంచ క్రమాన్ని పూర్తిగా మార్చివేస్తాయని అంచనా వేశారు. దీని అర్థం ఈ ప్రాంతాలలో ఉద్రిక్తతలు పెరగవచ్చు, భౌగోళిక రాజకీయ పరిస్థితి మారవచ్చు.

తైవాన్‌పై చైనా నియంత్రణ, రష్యా, యునైటెడ్ స్టేట్స్ మధ్య ప్రత్యక్ష ఘర్షణ కూడా ఆమె అంచనాలలో ఉన్నాయి. మూడవ ప్రపంచ యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు, కృత్రిమ మేధస్సుకు సంబంధించిన అంచనాలు వేశారు.

కాగా, బాబా వంగాను ‘బాల్కన్ల నోస్ట్రాడమస్’ అని కూడా పిలుస్తారు. ఆమె 1911లో జన్మించి 1996లో మరణించారు. ప్రపంచం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆమె ప్రవచనాలు తరచుగా వెలుగులోకి వస్తాయి. ఆమె ప్రవచనాల గురించి ఎటువంటి లిఖిత రికార్డు లేదు.. కానీ, ఆమె అనుచరులు, మీడియా వర్గాలు ఆమె అనేక ముఖ్యమైన సంఘటనలను అంచనా వేసిందని పేర్కొన్నాయి. ప్రిన్సెస్ డయానా మరణం, 9/11 ఉగ్రవాద దాడులు, అనేక పెద్ద ప్రకృతి వైపరీత్యాలు ఆమె ముందుగానే అంచనా వేయడం గమనార్హం. (Declaimer: ఈ వార్తలోని సమాచారం అందుబాటులోని వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)