
కావాల్సిన పదార్ధాలు : రెండు కప్పులు అటుకులు, మూడు కప్పుల పాలు , 200 గ్రాముల తురిమిన బెల్లం, ఒక కప్పు కొబ్బరి ముక్కలు , ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, బాదం పప్పులు, జీడిపప్పులు , కిస్ మిస్ లు తీసుకోవాలి.

ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి అటుకులను వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అటుకులను వేయిస్తే అవి అతుక్కోకుండా ఉంటాయి. అలాగే, బెల్లాన్ని కూడా తీసుకుని తురుముకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.

బెల్లం మిశ్రమం: ఇక ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి మూడు కప్పుల పాలు పోసి ఆ తర్వాత వాటిలో బెల్లం తురుమ, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి గరిటేతో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

పాలు మరిగిన తర్వాత వేయించుకున్న అటుకులను వేసి , మీడియం మంట మీద ఉంచి 16 నిమిషాల పాటు అలాగే ఉడికించాలి. ఈ మిశ్రమం పాయసంలా అయ్యే వరకు వరకు స్టవ్ మీదే దానిని ఉంచాలి.

అటుకులు బాగా ఉడకనివ్వాలి ఇలా చేస్తే రుచిగా ఉంటాయి. ఆ తర్వాత దానిలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, 10 బాదం పప్పులు, 6 కిస్‌మిస్‌లను కూడా బాగా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి అటుకుల,పాయసం రెడీ.