Bungee Jumping: మొదటిసారి బంగీ జంపింగ్ చేస్తున్నారా..? అయితే ప్రమాదాలు మీ దరి చేరకుండా తీసుకోవలసిన జాగ్రత్తలివే..

|

Jan 29, 2023 | 9:16 AM

ఎత్తైన శిఖరం, బిల్డింగ్‌పై నుంచి ఒక్క సారైనా బంగీ జంపింగ్ చేయాలనేది చాలా మంది సాహస ప్రియులకు ఉండే కల. అయితే మొదటి సారి బంగీ జంపింగ్ చేసేవారు తప్పని సరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

1 / 8
ఎత్తైన శిఖరం, బిల్డింగ్‌పై నుంచి ఒక్క సారైనా బంగీ జంపింగ్ చేయాలనేది చాలా మంది సాహస ప్రియులకు ఉండే కల. అయితే మొదటి సారి బంగీ జంపింగ్ చేసేవారు తప్పని సరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే అపశ్రుతులు వాటిల్లే ప్రమాదం ఉంది. మరి ఆ సమయంలో పాటించవలసిన జాగ్రత్తలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 8
మొదటి సారి బంగీ జంపింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లయితే.. ముందుగానే ఆ సమయంలో ఏ దుస్తులను ధరించాలనేది నిర్ణయించుకోవాలి. జంపింగ్ సమయంలో టీ షర్ట్, షార్ట్‌లు లేదా ప్యాంటు వంటి తేలిక దుస్తులను మాత్రమే ధరించండి.

3 / 8
ఇంకా ఆ సమయలో స్కర్టులు, హైహీల్స్ ధరించడం మానుకోండి. ప్రత్యామ్నాయంగా మీరు బేర్ పాదాలు లేదా బూట్లతో బంగీ జంప్ చేయవచ్చు.

4 / 8
1, 2, 3... జంప్ కౌంట్‌డౌన్ ముగిసేలోపు జంప్ చేయండి. జంపింగ్ ట్రైనర్ లెక్కించే వరకు మీరు ఆగినట్లయితే తర్వాత దూకడానికి వెనుకాడతారు లేదా భయాందోళనకు గురవుతారు.

5 / 8
ఎల్లప్పుడూ జంప్ ట్రైనర్ సలహాను అనుసరించండి. జంప్ ట్రైనర్‌కు బంగీ జంపింగ్ గురించి బాగా తెలుసు కాబట్టి వారి సలహాను పాటించడం మంచిది.

6 / 8
జంపింగ్ చేసే సమయంలో పాటించవలసిన డైట్ గురించి తెలుసుకోవడం మంచింది. అతిగా తిని దూకడం కంటే ఖాళీ కడుపుతో దూకడం చాలా ఉత్తమం.

7 / 8
ఇంకా ఈ సమయంలో మొబైల్, కెమెరా, నగలు లేదా మరేదైనా తీసుకెళ్లడానికి అనుమతి ఉండదు. కాబట్టి, మీరు దూకేటప్పుడు వాటిని మోయవద్దు.

8 / 8
 మీరు బంగీ జంపింగ్ కోసం అనుమతిపై సంతకం చేసే ముందు సూచనలను జాగ్రత్తగా చదవండి. జాబితాలో పేర్కొన్న గుండె సమస్య, వెన్నునొప్పి వంటి దీర్ఘకాలిక వ్యాధులు మీకు ఉంటే జంపింగ్‌కు ఎట్టి పరిస్థితిలోనూ ప్రయత్నించవద్దు.