Apamarga Plant: ఉత్తరేణికి జ్యోతిష్య శాస్త్రంలో కూడా విశిష్ట స్థానం.. ఈ నివారణలతో అదృష్టం మీ సొంతం..

|

Aug 01, 2024 | 10:41 AM

ఇంటి చుట్టూ రకరకాల మొక్కలు పెరుగుతాయి. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అన్న సామెతను నిజం చేస్తూ మన చుట్టు పక్కల పెరిగే మొక్కలను పట్టించుకోకుండా కలుపు మొక్కలు అంటూ కత్తిరిస్తారు. అయితే కొన్ని కలుపు మొక్కల్లో ఔషధ గుణాలు ఉంటాయి. ఎంత వైద్యం చేసినా తగ్గని వ్యాధులు కూడా కలుపు మొక్కలుగా భావించే మొక్కలు తగ్గిస్తాయి. కొన్ని మొక్కల వేర్లు, ఆకులు, కొమ్మలు కూడా అనేక వ్యాధులను నివారిస్తాయని ఆయుర్వేదం పేర్కొంది. పూర్వకాలంలో వీటిని ఎక్కువగా ఉపయోగించి దీర్ఘకాలంగా ఆరోగ్యంగా జీవించే వారు. అలాంటి ఔషద మొక్కలో ఉత్తరేణి ఒకటి. ఈ ఉత్తరేణిని వివిధ పేర్లతో పిలుస్తారు. చాలామంది చిర్చితా లేదా లతాజీరా వంటి పేర్లతో పిలుస్తారు.

1 / 8
హిందూ మతంలో ఉత్తరేణి మొక్కకు విశిష్ట స్థానం ఉంది. వినాయక చవితికి పత్రిగా ఉపయోగిస్తారు. తులసి, రావి చెట్టు, అపరాజిత వంటి వాటిని పూజించినట్లే ఉత్తరేణిని కూడా పూజకు ఉపయోగిస్తారు. అయితే జ్యోతిష్యంలో కూడా దీనికి ప్రాధాన్యత ఉంది. అంతే కాదు ఆయుర్వేదంలో కూడా ఉత్తరేణికి ఉత్తమ స్థానం ఉంది. ఇందులోని ఔషధ, దివ్య గుణాలు అపారమైనవి.

2 / 8
తులసి, జమ్మి వలనే ఉత్తరేణి కూడా యజ్ఞ-పూజలకు అవసరమైన మొక్క. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మొక్క అనేక నివారణలు చేస్తారు. జీవిత మార్గంలో విజయం, పురోగతిని తీసుకొస్తాయి.

3 / 8
ఎరుపు రంగులో ఉన్న ఉత్తరేణి కొమ్మతో పళ్లు తోముకుంటే దంతాలు బలంగా మారతాయి. ఉత్తరేణి రసంలో దూది పెట్టుకుంటే పిప్పి పన్ను నొప్పి తగ్గుతుంది.

4 / 8
పౌర్ణమి రోజు ఉదయం ఉత్తరేణి మొక్క మూలానికి పంచోపచార పూజ చేయడం ఉత్తమ ఫలితం ఉంటుంది. ఉత్తరేణి వేరుని మణికట్టు లేదా చేతిపై తాయెత్తు రూపంలో కట్టుకోండి. ఇలా చేస్తే జీవితంలోని అతి పెద్ద సమస్యల నుంచి త్వరగా బయటపడతారు.

5 / 8
ఉత్తరేణి మొక్కలు ఔషధంతో పాటు ప్రాణం పోస్తాయి. ఆదివారం పుష్య నక్షత్ర తిథి రోజున గర్భిణీ స్త్రీ నడుము చుట్టూ ఈ చెట్టు వేరును కట్టడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీని ప్రభావం గర్భిణీ స్త్రీ శరీరంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. శరీరం, మనస్సు ఆరోగ్యంగా, ఆనందంతో నిండి ఉంటుంది.

6 / 8
తెల్లటి ఉత్తరేణి మొక్కను నాటితే ఇంట్లో సరైన స్థలంలో పెంచుకోవాలి. ఆనందం, శ్రేయస్సు పొందవచ్చు.

7 / 8
ఇంట్లో ఎవరిపైన చెడు దృష్టి పడినా లేదా వివాహం నిశ్చయమైన తర్వాత కూడా విడిపోయినా ఉత్తరేణి మొక్క వేర్లను పూజించి దానిని కుడి చేతికి ధరించవచ్చు.

8 / 8
ఉత్తరేణి చెట్టు వేరును శుభ ముహార్తంలో ఇంట్లో సురక్షితమైన స్థలంలో పెడితే ఆహారం, ధనప్రాప్తి కలుగుతుంది. జీవితంలో లోటు ఉండదు.