School Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. డిసెంబర్, జనవరిలో భారీ సెలవులు.. పూర్తి వివరాలు ఇవే!

Updated on: Nov 30, 2025 | 10:36 AM

పాఠశాల విద్యార్థులకు ఇది ఎగిరిగంతేసే వార్త అనే చెప్పవచ్చు.. ఎందుకంటే రాబోయే నెల డిసెంబర్.. జనవరి ఎండింగ్ మధ్యలో స్కూల్‌లకు భారీగా సెలవులు రానున్నాయి. క్రిస్‌మస్, సంక్రాంతి, రెండో శనివారం, ఆదివారం ఇలా మొత్తం కలిపి ఒక నెలరోజుల్లోనే ఏకంగా 18 రోజుల పాటు స్కూల్‌లకు సెలవులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సెలవులు ఎప్పుడెప్పుడున్నాయో పూర్తి వివరాలు చూసేద్దాం పదండి.

1 / 6
నేటితో నవంబర్ నెల ముగిసి పోనుంది.. రేపట్నుంచి డిసెంబర్ రానుంది. రాబోయే నెలలో స్కూల్‌ సెలవుల కోసం పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే డిసెంబర్ ఎండింగ్‌లో క్రిస్మస్, జనవరి మొదట్లో సంక్రాంతి వంటి పెద్ద పండుగలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు భారీగా సెలవులు రానున్నాయి.

2 / 6
డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగ నేపథ్యంలో, క్రైస్తవ మిషనరీ పాఠశాలలు భారీగా సెలవులను ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు మిషనరీ పాఠశాలల్లో డిసెంబర్ 21 నుండి 28 వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు సెలవులు ఉండే అవకాశం ఉంది. సాధారణ పాఠశాలకు కూడా రెండ్రోజులు సెలవులు ఉండే అవకాశం ఉంది.

3 / 6
అయితే డిసెంబర్ నెలలో మొత్తం నాలుగు ఆదివారాలతో పాటు రెండో శనివారం కలుపుకొని ఐదు రోజులు సెలవులు ఉండనుండగా.. క్రిస్‌మస్ వేడుకల సెలవులు కూడా ఉండనున్నాయి. ఈ సెలవులు ముగిసిన వెంటనే మళ్లీ న్యూయర్ వస్తుంది.

4 / 6
న్యూయర్ రాకతో జనవరి మొదలవుతుంది. జనవరిలో ఎలాగో సంక్రాంతి పండుగ సెలవుల వస్తాయి. ఇప్పటికే ఏపీలో పండగ సెలవులపై క్లారిటీ వచ్చింది. కొన్ని నివేదికల ప్రకారం.. ఈ విద్యాసంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీ నుండి జనవరి 18వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు సెలవులు ఉండే అవకాశం ఉంది. అయితే స్కూళ్ల హాలీడేస్ విషయంలో క్లారిటీ వచ్చినా.. కాలేజీలకు సెలవులపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

5 / 6
విద్యార్థులకు పండగ సెలవుతో పాటు వీకెండ్ సెలవులు కూడా కలిసి వచ్చాయి. జనవరి 10వ రెండో శనివారం 11 ఆదివారం కావడంతో ఈ రెండ్రోజులు కూడా అదనంగా కలిసి వచ్చాయి. ఇదే కాకుండా సెలవుల ముగిసే చివరి రోజు జనవరి 18 కూడా ఆదివారం కావడం మరో విశేషం. నిజానికి పండగ సెలవులు ఆరు రోజులే అయినప్పటికీ.. వారాంతపు సెలవులతో కలుపుకొని ఇవి తొమ్మిది రోజులకు చేరాయి.

6 / 6
అయితే తెలంగాణలో సంక్రాంతి సెలవుపై మాత్రం ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. సాధారణంగా అయితే జనవరి 10 నుంచి 15 లేదా.. 16వ తేదీ వరకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. అంటే తెలంగాణలోనూ 5 నుంచి ఆరు రోజులు పండగ సెలవులు, మూడు వారాంతపు సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులకు సుదీర్ఘ విరామం లభించనుంది.