
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తన ఫుడ్ సీక్రెట్ ను బయటపెట్టాడు. తాను ప్యూర్ వెజిటేరియన్ అని, తనకు అత్యంత ఇష్టమైన ఫుడ్ స్పైసీ ఆంధ్రా మీల్స్ అని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచాడు. అలాగే యాంకర్ మీకు నచ్చిన రెస్టారెంట్ ఏది అని అడగగా, అనిరుధ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేషనల్ లాడ్జ్ అని చెప్పాడు.

తాను మాట్లాడుతూ.. అది చాలా పాత రెస్టారెంట్. ఎప్పుడూ ఫుల్ గా ఉంటుంది. అది నా ఫేవరెట్. మీరు తప్పకుండా నేషనల్ లాడ్జ్ ట్రై చేయాలి, ఎందుకంటే అక్కడ స్పైసీ ఆంధ్రా మీల్స్ దొరుకుతుందని చెప్పాడు . అంతే కాకుండా తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని అడగగా, నా మొదటి ప్రియారిటీ , రెండ ప్రియారిటీ మొత్తం ఆంధ్రా మీల్సే అంటూ తెలియజేశాడు. అలాగే ఆయన చెన్నైలోని జార్జ్ టైన్ ప్రాంతంలో గోవిందప్ప నాయకన్ వీధిలో ఉన్న నేషనల్ లాడ్జ్ దశబ్దాలుగా ఆంధ్ర స్టైల్ శాకాహారాన్ని అందిస్తుందని దీనికి మంచి ప్రాముఖ్యత ఉందని తెలియజేశాడు.

మరి అసలు ఆ రెస్టారెంట్ చరిత్ర ఏమిటి అంటే? చెన్నైలోని జార్జ్ టౌన్ లో, గోవిందప్ప నాయకన్ స్ట్రీట్ లో ఉన్న నేషనల్ లాడ్జ్ కు ఏకంగా 73 ఏళ్ల చరిత్ర ఉంది.1952లో కోట ఏహిరాజులు గారు దీనిని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు, అదే ఓల్డ్ స్కూల్ స్టైల్, అదే రుచి, అదే క్వాలిటీతో నడుస్తోంది.తెలుగు వారిచే నడపబడుతున్న ఈ హోటల్ లో ఆంధ్రా స్టైల్ వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుంది. చెన్నైలో ఆంధ్రా భోజనం అంటే గుర్తుకు వచ్చే మొదటి పేరు ఇదే.

అక్కడ భోజనానికి మంచి స్పెషాలిటీ ఉంటుంది. కారంగా మంచి రుచితో ఉంటాయి. ఈ రెస్టారెంట్ తన సాంప్రదాయ ఆంధ్ర వంటకాలకు ప్రసిద్ధి చెందింది. వీటితో పాటు అనేక రకాల సైడ్ డిష్‌లు వస్తాయి. వాటిలో తాలింపు , అప్పళం, పప్పు, చట్నీ ,రైతా వంటివి ఉంటాయి. ఇక్కడి ప్రసిద్ధ వంటకాల్లో ఒకటి పప్పు పొడి, దీనిని గన్‌పౌడర్ అని కూడా పిలుస్తారు.

ఇది సాధారణంగా అన్నం,నెయ్యితో కలిపి తయారుచేసే మసాలా పప్పుల పొడి. ఈ భోజనంలో రసం, పులుసు, పెరుగు అన్నం వంటి వంటకాలు కూడా ఉంటాయి, చివరగా ఘాటైన వేయించిన మిరపకాయను వడ్డిస్తారు. అందుకే చాలా మంది ఇక్కడ భోజనం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.