మామిడి పువ్వుతోనూ బోలెడన్నీ లాభాలు.. మధుమేహంతో పాటు మరెన్నో రోగాలకు దివ్యౌషధం..!

Updated on: Mar 27, 2025 | 3:55 PM

వేసవిలో అందం, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవాలంటే.. తప్పనిసరిగా మామిడి పండ్లను తినాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాదు.. మామిడి చెట్టు నిండా అనేక ఔషధ గుణాలు నిండివున్నాయని చెబుతున్నారు. మామిడితో పాటు దాని టెంక, మామిడి ఆకులు, బెరడు, మామిడి పువ్వు కూడా ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.. అవును మామిడి పువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ఈ పువ్వులను అనేక రకాలుగా ఉపయోగించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
మామిడి పూలలో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది. దీంతో డయాబెటిస్ ముప్పు రాకుండా కాపాడుకోవచ్చు. మామిడి పూలలో యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలు, యాక్నె వంటి చర్మ సమస్యలు రాకుండా కాపాడుతాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి.

2 / 5
మామిడి పూతలో పుష్కలమైన పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. మామిడి పూలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి మంట, వాపు వంటి సమస్యలు తగ్గిస్తాయి. కీళ్లను ఆరోగ్యంగా ఉంచి ఆర్థరైటిస్ రాకుండా కాపాడుతాయి.

3 / 5
మామిడి పూలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా అనేక రకాల ఇన్పెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. మామిడి పూలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చూస్తాయి. దీంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి.

4 / 5
మామిడి పూలను దగ్గు తగ్గించడంలోనూ ఉపయోగిస్తారు. ఇది దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మామిడి పూలలో ఫైబర్ ఉంటుంది. దీనిని తినడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చు. బరువు తగ్గాలని చూసేవారు ఈ పువ్వు తినడం మంచిది.

మామిడి పూలను దగ్గు తగ్గించడంలోనూ ఉపయోగిస్తారు. ఇది దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. మామిడి పూలలో ఫైబర్ ఉంటుంది. దీనిని తినడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చు. బరువు తగ్గాలని చూసేవారు ఈ పువ్వు తినడం మంచిది.

5 / 5
వేసవిలో చాలా మంది ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడుతుంటారు. వేడి వల్ల ఈ సమస్య వస్తే, మామిడి పువ్వు వాసన ఈ సమస్యను నయం చేస్తుంది. అంతేకాదు... మామిడి పూలలోని పోషకాలు ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు రాకుండా చూస్తాయి. ఇవి అలసటను కూడా దూరం చేస్తాయి. మెంటల్ క్లారిటీని పెంచుతాయి.