గుమ్మడి గింజలు కాదు.. ఇలా నానపెట్టిన నీరు తాగితే.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Updated on: Jul 22, 2025 | 3:52 PM

గుమ్మడి.. ఒకప్పుడు కేవలం దిష్టి కోసం మాత్రమే వాడే గుమ్మడికాయ ఇప్పుడు మంచి పోషకాహారంగా ప్రసిద్ధికెక్కింది. గుమ్మడికాయ జ్యూస్‌లు, వడియాలు, కూరగా కూడా చేసుకుని తింటున్నారు చాలా మంది. అలాగే, గుమ్మడికాయ గింజలు కూడా ఎక్కువ మంది ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. గుమ్మడికాయతో పాటుగానే గింజలు కూడా రెట్టింపు ఆరోగ్యాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ స్పూన్‌ గుమ్మడి గింజలు తినటం వల్ల బోలెడన్నీప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే,ఈ గుమ్మడి గింజలను రాత్రి నీళ్లలో నానాబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగటం వల్ల అంతే ప్రయోజనం ఉందంటున్నారు నిపుణులు. ఆయా లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5
గుమ్మడి గింజల్లో అనేక పోషక విలువలు ఉంటాయి. వాటిని నానపెట్టిన నీరు తాగితే అనేక ప్రయోజనాలు పొందొచ్చునని పోషకాహార, వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజల నీరు కొలొస్ట్రాల్​ని తగ్గిస్తుంది. బీపీని కంట్రోల్​ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.

2 / 5
గుమ్మడి గింజలు ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు (ముఖ్యంగా విటమిన్ కె, ఈ)  ఖనిజాలు (మెగ్నీషియం, జింక్ వంటివి)తో నిండి ఉంటాయి. గుమ్మడికాయ గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును తగ్గించి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

3 / 5
గుమ్మడి గింజల నీటిలో యాంటీఆక్సిడెంట్స్​ పుష్కలంగా ఉంటాయి. దీంతో బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది.  గుమ్మడి గింజల నీటిలో ట్రైటోఫాన్​ ఉంటుంది. ఇది మంచి నిద్రకు చాలా అవసరం.

4 / 5
గుమ్మడి గింజల్లో ఫైబర్​ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుమ్మడి గింజల నీటితో శరీరానికి అనేక విటమిన్లు లభిస్తాయి.
గుమ్మడి గింజలను రాత్రంతా నానపెట్టండి. లేదా కనీసం ఆరు గంటలైన నానపెట్టి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గుమ్మడి గింజల్లో ఫైబర్​ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుమ్మడి గింజల నీటితో శరీరానికి అనేక విటమిన్లు లభిస్తాయి. గుమ్మడి గింజలను రాత్రంతా నానపెట్టండి. లేదా కనీసం ఆరు గంటలైన నానపెట్టి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
గుమ్మడికాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. దీంతో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.మెదడు వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో గుమ్మడికాయ గింజలు సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తాయి.