ఈ ఆకును అలుసుగా చూడొద్దు.. ఆహారంలో చేర్చుకున్నారంటే.. ఎముకలకు భలే బలం..

Updated on: Feb 11, 2026 | 10:07 PM

ఇటీవల కాలంలో పండ్లు, డ్రైఫ్రూట్స్‌ వినియోగం బాగా పెరిగింది. ఆరోగ్యం పట్ల అవగాహనతో ప్రజలు పోషకాహారం పట్ల ఆసక్తి చూపుతున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన పండ్లలో అంజీర్‌ కూడా ఉంది. అంజీర్ పండ్ల‌ల్లో ఫైటో కెమిక‌ల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. అలాగే క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వ‌రం వంటి పోష‌కాలు కూడా ఉంటాయి. అంజీర్ పండ్లు మాత్రమే కాదు.. అంజీర్‌ ఆకులు కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని మీకు తెలుసా..?

1 / 5
అంజీర్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మహిళలు వీటిని తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

2 / 5
అంజీర్ పండ్లే కాకుండా వీటి ఆకుల వల్ల కూడా లెక్కలేనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలతోపాటు ఫోలిక్ యాసిడ్, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో ఎ, సి, కె, బి విటమిన్లు సైతం ఉంటాయి.

3 / 5
అంజీర్ ఆకులను టీలో వేసి మరిగించి తీసుకుంటే.. అనేక వ్యాధులకు దివ్య ఔషధంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంజీర్ ఆకుల్లో అత్యధిక పోషకాలుంటాయి. అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

4 / 5
అంజీర ఆకులలోని యాంటీ ఆక్సిడెంట్లు మంచి పరిమాణంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ నుండి రక్షిస్తాయి. ఈ ఆకుల్లోని ఔషధ గుణాలు మలబద్ధక సమస్య నుంచి దూరం చేస్తుంది.

5 / 5
ఈ ఆకుల్లో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. మీ ఎముకలు దృఢంగా ఉండాలంటే అంజీర టీని మీ ఆహారంలో తప్పని సరిగా చేర్చుకోవాలి. ఇది ఎముకలతో పాటు దంతాలను సైతం బలపరుస్తుంది.