30 రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..

Updated on: Apr 18, 2026 | 6:57 AM

ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు, శరీరాన్ని చల్లబరుచుకోవడానికి సహజసిద్ధమైన మార్గాల వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రకృతి ప్రసాదించిన అమృతం లాంటి కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వరుసగా 30 రోజుల పాటు ప్రతిరోజూ ఒక కొబ్బరి నీటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో వచ్చే మార్పులేంటో ఒకసారి చూద్దాం:

1 / 5
సహజమైన ఎనర్జీ డ్రింక్: కొబ్బరి నీరు కేవలం దాహాన్ని తీర్చడమే కాదు ఇది ఒక సహజమైన శక్తి పానీయం. ఇందులో కృత్రిమ తీపి ఉండదు. మధ్యాహ్నం వేళ వచ్చే బద్ధకాన్ని, అలసటను ఇది తక్షణమే దూరం చేస్తుంది. దీనిలోని పొటాషియం అలసిపోయిన కండరాలకు విశ్రాంతినిచ్చి, రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.

2 / 5
గుండె ఆరోగ్యానికి మేలు: కొబ్బరి నీటిలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

3 / 5
జీర్ణ సమస్యలకు చెక్: చాలామంది భోజనం తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా ఎసిడిటీతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి కొబ్బరి నీరు ఒక వరం. ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండటం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. కడుపులోని వేడిని తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

4 / 5
లోపలి నుండి హైడ్రేషన్.. ముఖంపై మెరుపు: వేసవిలో చెమట రూపంలో శరీరం నుండి నీరు, ఎలక్ట్రోలైట్స్ బయటకు వెళ్లిపోతాయి. కొబ్బరి నీటిలో ఉండే పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ శరీరాన్ని లోపలి నుండి హైడ్రేట్ చేస్తాయి. దీని ప్రభావం మీ చర్మంపై స్పష్టంగా కనిపిస్తుంది. 30 రోజుల పాటు క్రమంగా తాగడం వల్ల చర్మం పొడిబారడం తగ్గి, సహజమైన మెరుపు వస్తుంది.

5 / 5
కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిదే అయినప్పటికీ, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇతర జ్యూస్‌లతో పోలిస్తే ఇందులో చక్కెర తక్కువగా ఉన్నా, షుగర్ ఉన్నవారు పరిమితంగా తీసుకోవడం మంచిది. కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి కిడ్నీ సమస్యలతో బాధపడేవారు వైద్యుని సలహా మేరకే దీనిని తీసుకోవాలి.

Follow Us