హిందూ సంప్రదాయాల ప్రకారం, జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ రోజున కొందరు ప్రత్యేకంగా పితృదేవతల కోసం పూజలు చేస్తుంటారు. ఇక అమావాస్య చాలా శక్తివంతమైనదని ప్రతి ఒక్కరి నమ్మకం, ఈ రోజున కొన్ని పనులు చేయకూడదు, కొన్ని పనులు చేయాలి అంటారు పండితులు. అయితే ఎలాంటి పనులు చేయడం వలన అమావాస్య రోజున అదృష్టం కలిసి వస్తుంది? దారిద్రయ్యం పోయి అదృష్టం కలిసి రావాలి అంటే ఏ పనులు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.

ఎవరు అయితే అమావాస్య రోజున ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేస్తారో, ఆ ఇంటిలో అప్పుల బాధలు తీరిపోయి చాలా ఆనందంగా గడుపుతారంట. ముఖ్యంగా ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేయడం వలన ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి, సానుకూల శక్తి ప్రవేశిస్తుందంట. అందుకే అమావాస్య రోజున ఉప్పు నీటితో ఇంటిని తుడుచుకోవాలి. దీని వలన దరిద్ర పోయి, అదృష్టం కలిసి వస్తుందంట.

అలాగే అమావాస్య రోజున మాంసాహారం అస్సలే తీసుకోకూడదు. ఈ రోజున సాత్విక ఆహారం తీసుకొని, ఎవరు అయితే శివారాధన చేస్తారో ఆ ఇంటి సమస్యలు అన్నీ తొలిగిపోయి, ఇంటిలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుంది.అమావాస్య రోజు తప్పకుండా పితృదేవతలకు పూజలు చేయాలి అంటారు. ఈ రోజున ఎవరు అయితే పితృదేవతలను దైవంగా భావించి, పూజలు చేస్తుంటారో, వారికి వారి జాతకంలో ఉన్న పితృదోషాలు తొలిగిపోయి, పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయంట. అంతే కాకుండా వారి ఆశీర్వాదం కూడా లభిస్తుందని చెబుతున్నారు పండితులు.

అమావాస్య రోజున ఇంటి ముందు దీపం వెలిగించాలి. దీని వలన ఇంటిలోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఇంటిలో సానుకూల శక్తి నెలకొంటుంది. ముఖ్యంగా ఈరోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వలన శని దోషాలు తొలిగిపోయి, ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు