Aloe Vera plant: కలబంద మొక్క త్వరగా పెరగాలా? జస్ట్ ఈ 5 సింపుట్స్‌ టిప్స్‌ పాటిస్తే చాలు

Updated on: Apr 16, 2026 | 7:00 AM

Aloe Vera Gardening Tips: ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేసే కలబందను ఈ రోజుల్లో దాదాపు అందరూ తమ ఇళ్లలో పెంచుకుంటున్నారు. కొందరు నేరుగా మట్టిలో నాటితే, మరికొందరు స్థలం లేక బాల్కనీల్లో కుండీలలో పెంచుతుంటారు. అయితే కొన్ని సార్లు అవి త్వరగా వాడిపోతూ ఉంటాయి. లేదా సరిగ్గా పెరగకుండా ఉంటాయి. కాబట్టి బాల్కనీలో కలబంద ఏపుగా పెరగాలంటే ఇప్పుడు మేం చెప్పబోయే చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేందో ఇప్పుడు చూద్దాం.

1 / 5
సరైన కుండీ ఎంపిక: చాలా మంది ప్లాస్టిక్ బకెట్‌లలో, చిన్న ప్లాస్టిక్ కుండీల్లో కలబందను పెంచుతూ ఉంటారు. కానీ ఇలా చెయడం కరెక్ట్ కాదు. కలబంద వేర్లు అంత లోతుగా వెళ్ళవు, కాబట్టి వెడల్పాటి, తక్కువ లోతు ఉన్న మట్టి కుండీలు ఎంచుకోవాలి. అలానే ఆ కుండీ అడుగున నీరు బయటకు వెళ్ళడానికి చిన్న చిన్న రంధ్రాలు చేయీలి.

2 / 5
మట్టి మిశ్రమం: చాలా మంది కుండీలో ఎక్క నీటిని పోస్తారు. అప్పుడు అవి కుండిలోనే ఎక్కువ సమయం ఉండిపోతాయి. కాబట్టి మీ కుండీలో సాధారణ మట్టితో పాటు ఇసుక కలిపిన మిశ్రమం లేదా మార్కెట్లో దొరికే కాక్టస్ మిక్స్ వాడటం మంచిది. ఇవి త్వరగా నీటిని పీల్చుకొని కుండీలో నీరు నిల్వ కుండా చేస్తాయి.

3 / 5
సూర్యరశ్మి: కలబందకు పరోక్ష సూర్యరశ్మి అవసరం. నేరుగా ఎండ తగిలితే ఆకులు మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి బాల్కనీలో ఎండ తక్కువగా ఉండే చోట కలబంద కుండీని ఉంచాలి. అప్పుడే దానికి అవసరమైన సూర్య కాంతి తగిలి మొక్క త్వరగా పెరుగుతుంది.

4 / 5
నీరు పోసే విధానం: ఈ మొక్కకు ఎక్కువ నీరు అవసరం లేదు. కుండీలోని మట్టి పూర్తిగా ఎండిపోయినప్పుడు మాత్రమే మళ్ళీ నీరు పోయాలి. అలా కాకుండా మళ్లీ మళ్లీ ఎక్కువ నీరు పోస్తే, కుండిలో నీరు నిలిచి పోయి వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది.

5 / 5
ఎరువులు: కలబందకు ఎరువులు ఎక్కువగా వేయాల్సిన పనిలేదు. సంవత్సరానికి ఒక్కసారి సేంద్రియ ఎరువులు వేస్తే చాలా మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ బాల్కనీలో కలబంద మొక్క ఎంతో పచ్చగా, ఏపుగా పెరుగుతుంది.

Follow Us