
ముందుగా అలసందలు నానబెట్టుకోవాలి: ముందుగా మీరు ఒక కప్పు అలసందలను తీసుకుని వాటిని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి 6 నుంచి 8 గంటల పాటు వీటిని బాగా నానబెట్టాలి. ఆ తర్వాత ఈ నీటిని మొత్తాన్ని వంపేసి, మీరు మిక్సీలో నీరు పోసి మరి ఎక్కువగా పోయకుండా కొంచం బరకగా దీనిని గ్రైండ్ చేసుకోవాలి.

పిండిని సిద్ధం చేసుకోవాలి: ఇంకా మిక్సీ పట్టుకున్న అలసంద పిండిలో మీరు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కట్ చేసిన కరివేపాకు ఆకులు , కొద్దిగా కొత్తిమీరను దీనిలో వేసుకోవాలి. ఇంకా దీనిలో దీనిలో కొద్దిగా జీలకర్ర, సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా బియ్యప్పిండిని వేసి కలపాలి.

వడలు ఇలా చేసుకోవాలి: మీరు రెడీ చేసి పెట్టుకున్న పిండిని తీసుకుని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని మీ చేతికి కొంచం ఆయిల్ రాసుకుని వడ ఆకారంలో చేసి వీటిని పలుచగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన వడలు బయటకు క్రిస్పీగా, ఇంకా లోపల మెత్తగా ఉంటాయి.

వడలను వేయించుకోవాలి: ఇప్పుడు మీరు పాన్ లో ఆయిల్ వేసి, ఇంకా వడలను జాగ్రత్తగా ఆయిల్ లో వేసుకోవాలి. మీడియం మంటపై రెండు వైపులా మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఎక్కువ మంటపై వీటిని వేయిస్తే మంచిగా ఉడుకుతాయి. బయట కాలకపోతే ఇవి సరిగ్గా ఉడకకపోవచ్చు.

ఇంకా ఇవి బాగా వేగిన తరవాత అలసంద వడలను ఆయిల్ నుంచి తీసి వీటిని టిష్యూపై పెట్టాలి. ఇంకా వీటిని వేడి వేడిగా కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీ ఇంకా అల్లం చట్నీతో తింటే మంచి రుచిగా ఉంటుంది.