
ఈ రోజుల్లో ఎంతో మంది మైగ్రేన్ సమస్యతో బాధ పడుతున్నారు. అలాంటి వాళ్ళు దీనిని కొంచం తింటే చాలు. ఎంతటి నొప్పైనా సరే మిమ్మల్ని వదిలి పెట్టి పారిపోవాల్సిందే. పాత రోజుల్లో ఎలాంటి ముందులు ఉండేవి కావు. ఇది వరకు రోజుల్లో ఇదే ఫాలో అయ్యేవాళ్ళు. మరి, ఆ చిట్కా ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

నువ్వులు : ఆయుర్వేదంలో నువ్వులను ఎక్కువగా వాడతారు. ఎందుకంటే ఇది మైగ్రేన్ నొప్పికి మంచి ఔషధం అని చెబుతారు. ఇంకా దీనిలో ఉండే మెగ్నీషియం, విటమిన్ E నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే, మీరు రోజూ ఒక నువ్వుల లడ్డు తింటే చాలు. లేదా మీ ఫుడ్ డైట్ లో నువ్వుల పొడిని వేయడం వలన మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందుతారు

వాము, లవంగాల మిశ్రమం : ఎంత భయంకర తలనొప్పిని అయినా వాము, లవంగాలు తగ్గిస్తాయి. అయితే మీరు 2 చెంచాల వాము, 3 లేదా 5 లవంగాలు రోస్ట్ చేయాలి. ఆ తరవాత ఈ మిశ్రమాన్ని తీసుకుని ఒక క్లాత్ లో వేసి మూట కట్టుకోవాలి. మీరు ఈ మూటను నుదిటి మీద పెట్టుకుంటే ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.

ఈ వాము జీర్ణక్రియకు, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. ఇంకా లవంగాలు యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంది. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే చాలా తక్కువగానే తీసుకోవాలి. ఒక టేబుల్ టీస్పూన్ వాము తీసుకుని లవంగం నీటిలో బాగా మరిగించి దీనిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. అయితే, దీనిని బాగా నొప్పిగా ఉన్నప్పుడే తీసుకోవాలి

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)