తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం.. ! కాఫీలో ఈ నూనె కలిపి రాసుకుంటే కేశ సౌందర్యం మీ సొంతం..

|

Mar 26, 2024 | 9:26 PM

ఒక కప్పు కాఫీ మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి కూడా కాఫీని ఉపయోగిస్తారు. జుట్టు నిగనిగలాడేలా, దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలో కూడా కాఫీ సహాయపడుతుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది షాంపూలు, కండిషనర్లు, సీరమ్‌లలో కూడా ఉపయోగిస్తుంటారు. మీరు ఇంట్లో కాఫీ హెయిర్ మాస్క్‌ని సులభంగా తయారు చేసుకోవచ్చు అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
2 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్‌లో 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను బాగా కలపండి. ఈ హెయిర్ మాస్క్‌ను జుట్టు కుదుళ్ల నుంచి బాగా అప్లై చేయండి. సుమారు 30 నిమిషాల పాటు మీ జుట్టును షవర్ క్యాప్‌తో కవర్‌ చేయండి. తర్వాత వాష్‌ చేసుకోవాలి.. కాఫీ, తేనె, కొబ్బరి నూనెతో కూడిన ఈ హెయిర్ మాస్క్ జుట్టుకు పోషణనిస్తుంది. జుట్టును మృదువుగా ఉంచుతుంది.

2 / 5
ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల కాఫీ పొడి, అరకప్పు పుల్లటి పెరుగు, 3 టీస్పూన్ల నిమ్మరసం కలిపి హెయిర్ ప్యాక్ తయారు చేసుకోండి. దీన్ని జుట్టు మూలాలకు పట్టించి ఆరనివ్వండి. తర్వాత షాంపూతో స్నానం చేయాలి.
ఒక కప్పు కాఫీ చేసి చల్లారనివ్వాలి. ముందుగా జుట్టుకు షాంపూ వేయండి. తర్వాత చల్లారిన కాఫీని మీ తలపై పోయాలి. కాసేపు అలాగే ఉండనివ్వండి. కాఫీలోని ఆమ్లత్వం స్కాల్ప్ pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. చుండ్రును తొలగిస్తుంది. జుట్టుకు మెరుపును పెంచుతుంది.

ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల కాఫీ పొడి, అరకప్పు పుల్లటి పెరుగు, 3 టీస్పూన్ల నిమ్మరసం కలిపి హెయిర్ ప్యాక్ తయారు చేసుకోండి. దీన్ని జుట్టు మూలాలకు పట్టించి ఆరనివ్వండి. తర్వాత షాంపూతో స్నానం చేయాలి. ఒక కప్పు కాఫీ చేసి చల్లారనివ్వాలి. ముందుగా జుట్టుకు షాంపూ వేయండి. తర్వాత చల్లారిన కాఫీని మీ తలపై పోయాలి. కాసేపు అలాగే ఉండనివ్వండి. కాఫీలోని ఆమ్లత్వం స్కాల్ప్ pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. చుండ్రును తొలగిస్తుంది. జుట్టుకు మెరుపును పెంచుతుంది.

3 / 5
1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల ఆముదం తీసుకోండి. ఈ రెండు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు కుదుళ్ల నుండి చివర వరకు అప్లై చేయండి. 30 నుండి 40 నిమిషాలు వదిలివేయండి. తర్వాత జుట్టును షాంపూతో కడగాలి. ఈ పద్ధతిని వారానికి ఒకటి లేదా రెండుసార్లు అనుసరించవచ్చు.

4 / 5
1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ తీసుకోండి. వీటిని బాగా కలపండి. జుట్టుకు పూర్తిగా అప్లై చేయండి, 30 నుండి 40 నిమిషాలు అలాగే ఉంచండి, తర్వాత షాంపూతో జుట్టును కడగాలి. ఈ హెయిర్ ప్యాక్‌ వారానికి రెండు సార్లు వేసుకుంటే ఫలితం ఉంటుంది.

5 / 5
ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలిపి మాస్క్‌ను సిద్ధం చేయండి. తర్వాత జుట్టు మీద అప్లై చేయాలి. 30-40 నిమిషాల తరువాత, షాంపూతో కడగాలి. మంచి కేశ సౌందర్యం కోసం కాఫీ హెయిర్‌ మాస్క్‌లో నిమ్మరసం, దాల్చిన చెక్క పొడిని కాఫీ పొడితో బాగా కలపండి. ఈ హెయిర్ ప్యాక్‌ని షాంపూ చేసిన తర్వాత తడి జుట్టు మీద అప్లై చేయండి. కొంత సమయం తర్వాత మీ తలను కడగాలి. ఇలా కాఫీతో జుట్టుకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి.