Heart Health: శరీరంలో కొలెస్ట్రాల్‌‌ని తగ్గించే పండ్లు.. తిన్నారంటే కొవ్వును కోసి తీసేసినట్లే.. మీ గుండె కూడా సేఫ్..!

|

Sep 10, 2023 | 3:33 PM

Heart Health: రోజురోజుకు గుండెపోటుతో చనిపోయేవారి సంఖ్య పెరుగుతోంది. గుండెపోటుకు ఎన్నో కారణాలు ఉన్నా శరీరంలో కొలెస్ట్రాల్ ఉండడమే ఎక్కువ కేసుల్లో ప్రధాన కారణంగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రించకపోతే జరగకూడని నష్టం జరిగిపోతుంది. అయితే కొలెస్ట్రాల్‌ని తగ్గించుకునేందుకు కూరగాయలతో పాటు కొన్ని రకాల పండ్లను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

1 / 5
ద్రాక్ష: బరువు తగ్గడంలో మెరుగ్గా పనిచేసే ద్రాక్షలు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రించగలవని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

2 / 5
సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మ, వంటి సిట్రస్ పండ్లు సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లకు ఉత్తమ ఆహారాలు. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.

3 / 5
యాపిల్స్: ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలకు ఉత్తమ ఎంపిక అయిన యాపిల్స్‌ కూడా శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కారణంగా రోజూ ఓ యాపిల్ తింటే హాస్పిటల్ ఖర్చులు ఆదా చేయోచ్చని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
అవోకాడో: కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నవారు అవోకాడో తినడం వల్ల సమస్య నుంచి బయట పడవచ్చని USDA పేర్కొంది.

5 / 5
స్ట్రాబెర్రీలు: అత్యంత రుచికరంగా ఉండే స్టాబెర్రీలు పండ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిండంతో పాటు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.