
ఇటీవలే 'తమ్ముడు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది సీనియర్ హీరోయిన్ లయ. ఇందులో నితిన్ కు అక్కగా నటించి ఆడియెన్స్ ను మెప్పించింది. అయితే ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేకపోయింది.

అయినా లయ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలున్నాయి. అలాగే పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తూ బుల్లితెర ఆడియెన్స్ కు దగ్గరవుతోందీ అందాల తార.

ఇదిలా ఉంటే సినిమా షూటింగులతో బిజీగా ఉంటోన్న లయ ఇటీవలే తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా వెకేషన్ కు వెళ్లింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది లయ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

ముఖ్యంగా ఈ ఫొటోల్లో లయ కుమారుడు, కూతురు చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా లయ కూతురు శ్లోక ఇదివరకు రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.