
ఒకప్పుడు చాక్లెట్‌ను డబ్బుగా కూడా ఉపయోగించేవారంట. దుకాణంలోకి వెళ్లి చాక్లెట్ గింజలను మనీకి బదులుగా ఇచ్చే వారంట అంటే ఇది ఇప్పుడు కాదు, వందల సంవత్సరాల కిందట. ఆహారం, బట్టలు ఇలా ఏది కొనుగోలు చేయాలి అన్నా, కోకూ గింజలను ఇచ్చే వారంట. అంటే ఇవి తినడానికే కాకుండా డబ్బుగా కూడా ఉపయోగపడ్డాయి అన్నట్లు.

చాక్లెట్స్ ఎలా కాస్తాయి అనేది చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. ఇవి ఏకంగా చెట్టు కాండాల నుంచి కాస్తాయంట. అవి కేవలం ఒకే రంగు కాకుండా, ఆ చెట్టు రంగు రంగు కాయలను ఇస్తుంది. ఇవి ఫుట్ బాల్ ఆకారంలో ఉంటాయంట.

అలాగే చాక్లెట్ వాసన అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. చాలా మంది దీని స్మెల్ చాలా ఇష్టం ఉంటుంది. అయితే ఇవి ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఆరు వందల సువాసనలు వెదజల్లుతాయంట. శాస్త్ర వేత్తలు చాక్లెట్‌లో 600లకు పైగా, సహజ సుగంధ సమ్మేళనాలు కనుగొన్నారు. ఇందులో ముఖ్యంగా గింజల వాసన, పండ్ల వాసన, పూల వాసన, మట్టివాసన, కాఫీ వాసన ఇలా అనేక రకాల వాసనలు వెదజల్లుతాయంట.

అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద చాక్లెట్ బార్. ఇది ఏనుగు కంటే చాలా పెద్ద సైజులో ఉంటుంది. ఇది ఆ రోజుల్లో రికార్డ్ సృష్టించింది. ఈ చాక్లెట్ ఏకంగా 5000 కిలో గ్రాముల బరువు ఉండేదంట. దీనిని ప్రపంచ రికార్డు బ్రేక్ చేయడానికి తయారు చేశారు.

చాక్లెట్స్ తియ్యగానే కాదు, కొన్నిసార్లు చేదుగా, కారంగా కూడా ఉండేవి. ఎందుకంటే, చాక్లెట్ తినాలి అనుకునే వారు ఆ రోజుల్లో బార్లను కాకుండా, కోకూ గింజలు నూరి డ్రింక్ లాంటిది తయారు చేసుకొని తాగే వారు, అయితే ఈ సమయంలో వారు కొన్ని మిరపకాయలు, మూలికలు కూడా కలుపుకునే వారంట. అలా చేదు, కారం చాక్లెట్స్ కూడా వారు రుచి చూశారు.