వాషింగ్ మెషీన్‌లో ఇటువంటి బట్టలు అస్సలు వేయొద్దు.. లైట్ తీసుకుంటే మెషీన్ మటాష్..

Updated on: Apr 02, 2026 | 8:51 PM

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో వాషింగ్ మెషీన్ ఇంటి పనులను ఎంతగానో సులభతరం చేస్తోంది. ఎన్ని బట్టలు ఉన్నా, తక్కువ సమయంలో ఎటువంటి శ్రమ లేకుండా ఉతికేయవచ్చు. అయితే వాషింగ్ మెషీన్ ఉంది కదా అని అన్ని రకాల వస్త్రాలను అందులో వేయడం అస్సలు మంచిది కాదు. కొన్ని రకాల బట్టలను మెషీన్‌లో ఉతకడం వల్ల బట్టలు పాడవ్వడమే కాకుండా మీ వాషింగ్ మెషీన్ కూడా త్వరగా రిపేర్లకు వచ్చే అవకాశం ఉంది.

1 / 5
రెయిన్‌కోట్లు: రెయిన్‌కోట్లు వాటర్ ప్రూఫ్ పదార్థంతో తయారవుతాయి. వీటిని మెషీన్‌లో వేసినప్పుడు నీరు లోపలికి వెళ్లక అవి బెలూన్‌లా ఉబ్బి చిరిగిపోయే ప్రమాదం ఉంది. ఇది మెషీన్ బ్యాలెన్స్‌ను కూడా దెబ్బతీస్తుంది.

2 / 5
ముత్యాలు, స్ఫటికాలు ఉన్న దుస్తులు: ముత్యాలు, పగడాలు లేదా పూసల పని ఉన్న ఖరీదైన దుస్తులను మెషీన్‌లో వేయకూడదు. మెషీన్ తిరుగుతున్నప్పుడు కలిగే రాపిడికి ఆ అలంకరణలు ఊడిపోవడమే కాకుండా బట్టల దారాలు బయటకు వచ్చేస్తాయి. అంతేకాదు ఆ ఊడిపోయిన పూసలు మెషీన్ డ్రమ్‌లో చిక్కుకుని మెషీన్‌ను పాడు చేస్తాయి.

3 / 5
సున్నితమైన ఉన్ని దుస్తులు: ఉన్ని బట్టలు చాలా మృదువుగా ఉంటాయి. వీటిని మెషీన్‌లో వేస్తే వాటి ఆకారం దెబ్బతిని, సాగిపోయే అవకాశం ఉంది. అందుకే వీటిని తక్కువ సబ్బుతో సున్నితంగా చేతితో ఉతకడం లేదా డ్రై క్లీనింగ్ చేయించడం ఉత్తమం.

4 / 5
నూనె, గ్రీజు మరకలు ఉన్న బట్టలు: వంట నూనె, పెట్రోల్, ఆల్కహాల్ లేదా మోటార్ గ్రీజు వంటి మరకలు ఉన్న బట్టలను నేరుగా వాషింగ్ మెషీన్‌లో వేయడం ప్రమాదకరం. ఇవి మండే స్వభావం కలవి కాబట్టి, మెషీన్ లోపల ఘర్షణ వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఇలాంటి బట్టలను ముందుగా చేతితో శుభ్రం చేశాకే మెషీన్‌లో వేయాలి.

5 / 5
ప్యాడ్‌లు లేదా మెటల్ వైర్లు ఉన్న ఖరీదైన బ్రాలను మెషీన్‌లో వేయకూడదు. మెషీన్ రొటేషన్ వల్ల వాటి ఆకారం మారిపోవడమే కాకుండా వైర్లు బయటకు వచ్చి బట్టలను చింపివేస్తాయి. ఇది మెషీన్ డ్రమ్‌కు కూడా హానికరం. లేస్ వర్క్ ఉన్న బట్టలు చాలా సున్నితంగా ఉంటాయి. మెషీన్ ఫోర్స్‌కు లేస్ చిరిగిపోయి బట్టల అందం పాడవుతుంది.

Follow Us