Digestion: భోజనం చేసిన వెంటనే కునుకు తీస్తున్నారా? ఆగండాగండి.. ఈ విషయం తెలుసుకోండి

|

Aug 29, 2024 | 8:20 PM

చాలా మంది భోజనం ముగిసిన వెంటనే నిద్రపోతుంటారు. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇంకొంత మంది భోజనం తర్వాత సిగరెట్ కాల్చుతారు. ఇలా చాలా మందికి భోజనం తిన్న తర్వాత రకరకాల అలవాట్లు ఉంటాయి. అయితే తెలిసో.. తెలియకో చేసే చేసే ఈ పొరబాట్లు పెద్ద సమస్యలకు కారణం అవుతుంటాయి..

1 / 5
చాలా మంది భోజనం ముగిసిన వెంటనే నిద్రపోతుంటారు. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇంకొంత మంది భోజనం తర్వాత సిగరెట్ కాల్చుతారు. ఇలా చాలా మందికి భోజనం తిన్న తర్వాత రకరకాల అలవాట్లు ఉంటాయి. అయితే తెలిసో.. తెలియకో  చేసే చేసే ఈ పొరబాట్లు పెద్ద సమస్యలకు కారణం అవుతుంటాయి.

2 / 5
ముఖ్యంగా ఆహారం తిన్న తర్వాత శరీరంలో జీర్ణక్రియ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి, ఈ సమయంలో ఏదైనా తప్పు చేస్తే.. అది మీ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఆహారం కూడా సరిగా జీర్ణం కాకపోవచ్చు.

3 / 5
లంచ్, డిన్నర్ వంటి భారీ భోజనం తిన్న తర్వాత కొన్ని రకాల కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. అప్పుడే మెటబాలిజం బాగుంటుంది. వివిధ వ్యాధుల ప్రమాదాన్ని నివారించవచ్చు. భోజనం తర్వాత ఆహారం జీర్ణం కావడం వెంటనే ప్రారంభమవుతుంది. ఆహార కణాలు ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, జీర్ణం చేయడానికి సమయం తీసుకుంటాయి. అందుకే మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోకూడదు. కనీసం 30 నిమిషాలపాటు వాకింగ్‌ చేయాలి.

4 / 5
ఆహారం తీసుకున్న తర్వాత ధూమపానం చేయడం అస్సలు మంచి అలవాటు కాదు. భారీ భోజనం తిన్న తర్వాత సిగరెట్ తాగితే ఊపిరితిత్తులను చికాకుపెడుతుంది. జీవక్రియపై చెడు ప్రభావం చూపుతుంది. అలాగే పండ్లు స్నాక్స్‌ కూడా తినకూడదు. భోజనానికి 2 గంటల ముందు పండ్లు తినాలి. అన్నం తిన్న తర్వాత పండ్లు తినకూడదు. ఈ అలవాటు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

5 / 5
భోజనానికి ముందు స్నానం చేయడం మంచిది. భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. ఎట్టిపరిస్థితుల్లోనూ భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. టీ, కాఫీలు తాగే అలవాటు మీకూ ఉందా? కానీ భారీ భోజనం తిన్న తర్వాత మాత్రం ఈ అభ్యాసం చేయకూడదు. లంచ్ లేదా డిన్నర్ తర్వాత టీ, కాఫీ తాగడం వల్ల గుండెల్లో మంట సమస్యలు వస్తాయి. పైగా శరీరంలో ఐరన్‌ శోషణకు కూడా ఆటంకం ఏర్పడుతుంది.